చక్కటి అందానికి ఇల్లే సౌందర్యశాల

ముఖ సౌందర్యం కోసం మార్కెట్​లో నెలకో క్రీం రిలీజ్​ అవుతూనే ఉంది. వాటి వల్ల ఎంత ఫలితం ఉంటుందో తెలీదు కానీ వేలు ఖర్చు పెట్టి కొంటుంటారు చాలామంది. అలాంటి వాళ్లు ఖరీదైన క్రీంలు కొనుక్కునే బదులు ఇంట్లోనే వాటిని సహజసిద్ధంగా తయారుచేసుకోవచ్చు. ఎలాంటి కెమికల్స్ వాడకుండా వంటింట్లో ఉపయోగించే పదార్థాలతో చేసిన ఈ నైట్​ క్రీంలు డబ్బుని ఆదా చేయడమే కాదు, మంచి ఫలితాన్ని కూడా ఇస్తాయి.

అలోవెరా నైట్​ క్రీం

కావాల్సినవి:

అలోవెరా జెల్​– 2 టేబుల్​ స్పూన్లు​

లావెండర్​ ఆయిల్​– 1 టేబుల్​ స్పూన్​

ప్రైమ్​రోజ్​ ఆయిల్​–1 టేబుల్ స్పూన్​

తయారీ:

గిన్నెలో లావెండర్​, అలోవెరా, ప్రైమ్​ రోజ్​ ఆయిల్స్​ తీసుకుని పేస్ట్​లా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని గాలి దూరని డబ్బాలో పెట్టి రాత్రి నిద్రపోయే ముందు ఉపయోగించాలి.

గ్రీన్ టీ, అలోవెరా నైట్ క్రీం

కావాల్సినవి:

గ్రీన్​ టీ పొడి– ఒక టేబుల్​ స్పూన్​

ఆల్మండ్​ ఆయిల్​–1 టేబుల్​ స్పూన్​

రోజ్​వాటర్​–1 టేబుల్​ స్పూన్​

ఎసెన్షియల్​ ఆయిల్​– 1 టేబుల్​ స్పూన్​

కలబంద జ్యూస్​– 1 టేబుల్​ స్పూన్​

బీస్​వాక్స్​– 1 టేబుల్​ స్పూన్

తయారీ:

ఒక  గిన్నెలో ఆల్మండ్​ ఆయిల్,​ బీస్​వాక్స్​   వేసి సన్నని మంటమీద  వేడి చేసి కరిగించాలి.  ఆ మిశ్రమాన్ని మరొక గిన్నెలో తీసుకుని  అందులో కలబంద, రోజ్​వాటర్​, ఎసెన్షియల్​ ఆయిల్​ కలపాలి.  దాన్ని గాలి దూరని డబ్బాలో ఉంచాలి.రాత్రి  నిద్రపోయే ముందు ముఖానికి రాసుకోవాలి.

ఆల్మండ్ ఆయిల్ నైట్ క్రీం

కావాల్సినవి:

ఆల్మండ్​​ ఆయిల్​– 1 టేబుల్​ స్పూన్​,  కోకో బటర్​– 2 టేబుల్​ స్పూన్లు​

తేనె– 1 టేబుల్​ స్పూన్​, రోజ్​ వాటర్​– 2 టేబుల్​ స్పూన్లు​

తయారీ:

పాన్​లో ఆల్మండ్​ ఆయిల్​, కోకోబటర్​ వేసి కరిగించాలి.  ఆ మిశ్రమాన్ని గిన్నెలో తీసుకుని  తేనె, రోజ్​ వాటర్​  కలపాలి. వాటన్నింటిని బాగా కలిపి చల్లార్చి ఫ్రిజ్​లో పెట్టాలి.

కొబ్బరి, గ్లిజరిన్

కావాల్సినవి

ఆల్మండ్​ ఆయిల్​– 1 టేబుల్​ స్పూన్​

కొబ్బరి నూనె– 1 టేబుల్​ స్పూన్​

గ్లిజరిన్​– 1 టీ స్పూన్

రోజ్​ వాటర్​– 2 టేబుల్​ స్పూన్లు

తయారీ

కొబ్బరి నూనె, ఆల్మండ్​ ఆయిల్​ని  గిన్నెలో వేసి  సన్నని మంట మీద కరిగించాలి.  కరిగిన తర్వాత మరొక గిన్నెలో ఆ మిశ్రమాన్ని తీసుకుని  రోజ్​ వాటర్​, గ్లిజరిన్​  వేసి బాగా కలపాలి.  ఆ మిశ్రమాన్ని  గాలి దూరని డబ్బాలో పెట్టాలి. ఈ క్రీంని వారానికి మూడుసార్లు ఉపయోగిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

అవకాడో పెరుగు

కావాల్సినవి: అవకాడో   – ఒకటి

పెరుగు      – అరకప్పు

తయారీ: గిన్నెలో అవకాడో  గుజ్జుని తీసుకుని పెరుగు కలిపి పేస్ట్​లా చేసుకోవాలి.  తర్వాత  ఆ మిశ్రమాన్ని  గాలి దూరని డబ్బాలో ​ పెట్టి  చల్లని, పొడి ప్రదేశంలో  ఉంచాలి. ఈ  క్రీమ్​ని వారానికి రెండు సార్లు రాసుకోవాలి.

ఆరెంజ్ ఆయిల్

కావాల్సినవి: ఆరెంజ్​ తొక్కలు–  1 కప్పు,  ఆరెంజ్ ఆయిల్– 4 చుక్కలు

పెట్రోలియం జెల్‌– 2 టేబుల్​ స్పూన్లు

గ్లిజరిన్– 2 టేబుల్ స్పూన్లు

తయారీ: పై పదార్థాలన్నింటినీ మిక్సీ పట్టి  పేస్ట్​లా చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని  గాలి దూరని డబ్బాలో ఉంచి రాత్రి నిద్రపోయే ముందు ముఖానికి రాసుకోవాలి.

యాపిల్ నైట్ క్రీం

కావాల్సినవి

రోజ్​ వాటర్​ – 5 టేబుల్​ స్పూన్లు

యాపిల్స్​– రెండు

ఆలివ్​ ఆయిల్​– 1 టేబుల్​ స్పూన్​

తయారీ

యాపిల్​ తొక్క తీసి, విత్తనాలు లేకుండా  చిన్న చిన్న ముక్కలు  కట్​ చేసుకోవాలి.  ఆ ముక్కల్లో ఆలివ్​ ఆయిల్​ వేసి సన్నని మంట మీద  ఉడికించాలి.  యాపిల్​  ఉడికిన తర్వాత  చల్లార్చి  రోజ్ వాటర్​ కలిపి పేస్ట్​లా చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని  గాలి దూరని డబ్బాలో తీసుకుని ఫ్రిజ్​లో పెట్టాలి. ఈ క్రీంని  తయారు చేసిన ఆరు రోజుల్లోనే వాడాలి.

Latest Updates