కరోనా వేస్టేజ్​తో జాగ్రత్త

గైడ్​లైన్స్​ ప్రకారమే డిస్పోజ్​ చేయాలె: ఎన్జీటీ

న్యూఢిల్లీ: కరోనా పేషెంట్ల ట్రీట్ మెంట్ సందర్భంగా వెలువడే వేస్ట్ ను సైంటిఫిక్ గా, గైడ్​లైన్స్​కు అనుగుణంగా డిస్పోజ్ చేయాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఆదేశించింది. ఈ ప్రక్రియ రూల్స్ ప్రకారం జరుగుతుందా లేదా అనేది పర్యవేక్షించాలని సెంటర్, సీపీసీబీలతో ఏర్పాటైన కమిటీకి సూచించింది. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్ మెంట్, హెల్త్, అర్బన్ డెవలప్ మెంట్, జల్ శక్తి, డిఫెన్స్, సీపీసీబీలతో కూడిన హైలెవల్ టాస్క్ టీమ్ ఈ ప్రక్రియను పర్యవేక్షించాలంది. కరోనా వేస్టేజీ స్టోరేజ్, ట్రాన్స్ పోర్ట్, హ్యాండ్లింగ్, మేనేజ్ మెంట్, డిస్పోజల్ ను గైడ్‌ లైన్స్ కు అనుగుణంగా చేయాలని చెప్పింది. ఈమేరకు ఎన్జీటీ చైర్ పర్సన్ జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్ ఆధ్వర్యంలోని బెంచ్ అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలను కూడా ఆదేశించింది. వ్యర్థాలను సరిగా డిస్పోజ్ చేయని పక్షంలో ఎన్విరాన్ మెంట్ తో పాటు ప్రజల ఆరోగ్యానికి ముప్పు ఉంటుందని హెచ్చరించింది. దీనికి సంబంధించి గ్రౌండ్​ లెవల్​లో తీసుకున్న చర్యలను, చేసిన ఏర్పాట్లను పరిశీలించి వచ్చే నెల 15 లోగా రిపోర్టు ఇవ్వాలని సీపీసీబీని ఆదేశించింది.

For More News..

‘పీఎం కేర్స్ ఫండ్’పై ఆడిటింగ్ ఉండదు!

శ్రీలంక నేవీలో 29 మందికి ​ కరోనా పాజిటివ్​

Latest Updates