ప్రేమ విఫలమైందని హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి తాను ఉంటున్న హాస్టల్‌లో ఆత్మహత్య  చేసుకున్నాడు. లవ్ ఫెయిల్ అయిందన్న బాధలో అతడు ఈ పని చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

కరీంనగర్ జిల్లా చౌలపల్లికి చెందిన రాగి కార్తీక్ (22) ఆరు నెలల క్రితం టీసీఎస్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా జాయిన్ అయ్యాడు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి క్యాంపస్‌లో వర్క్ చేస్తున్నాడు.  రాయదుర్గంలోని అంజయ్య నగర్‌లో ఓ హాస్టల్‌లో ఉంటున్న కార్తీక్ మంగళవారం ఆఫీసుకు వెళ్లకుండా హాస్టల్ గదిలోనే ఉండిపోయాడు. తనతో పాటు రూమ్‌లో ఉంటున్న వాళ్లంతా డ్యూటీకి వెళ్లాక సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రూమ్ మేట్స్ రాత్రి పది గంటలకు ఆఫీసు నుంచి వచ్చి ఎంతసేపు తలుపు తట్టినా తెరవకపోవడంతో అనుమానం వచ్చి హాస్టల్ యాజమాన్యానికి చెప్పారు. వారు డోర్ బద్ధలు కొట్టి చూడగా కార్తీక్ మృతదేహం ఫ్యాన్‌కు వేలాడుతోంది. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ విఫలం కావడం వల్లే కార్తీక్ బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Latest Updates