కరోనాను నయం చేసే పరుపు.. ఒకరి అరెస్ట్​

కరోనా కాలంలో ఎన్నెన్నో పుకార్లు పుట్టేస్తున్నాయి. కరోనాను పరుపు నయం చేస్తుందన్నది అందులో ఒకటి. మహారాష్ట్రలో ఓ వ్యక్తి అలాంటి అబద్ధపు మాటలు చెప్పి పరుపులు అమ్మేందుకు ప్రకటన ఇచ్చాడు. భివాండీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అతడిని అరెస్ట్​ చేశారు. కరోనాను నయం చేసేలా స్పెషల్ గా పరుపులను డిజైన్ చేశామని, వాటిని వాడితే వైరస్ సోకదని, వచ్చినా తగ్గిపోతుందని ఓ గుజరాతీ పేపర్లో అతడు ప్రకటన ఇచ్చాడు. అది పోలీసుల దృష్టికి వెళ్లడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు.

Latest Updates