పీజీలు చదివి బిచ్చమెత్తుతున్నారు

అడుక్కోక పోతే ఏదైనా పనిచేసుకోవచ్చు కదా…. ఇది మనలో చాలామంది జనరల్‌గా బిచ్చగాళ్లతో అనే మాటే. అయితే ఆ మాటని సీరియస్ గా తీసుకున్నట్టే ఉన్నారు చాలామంది. కాకపోతే అది రివర్స్‌లో అర్థం చేసుకున్నారు. చదువుకున్నవాళ్లలో కూడా ఇప్పుడు అడుక్కోవటాన్నే ‘పని’గా చేసుకుంటున్నారు. రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌‌‌‌లో జరిగిన సర్వేలో ఈ విషయాలు తెలిసి షాక్ తిన్నారట అక్కడి అధికారులు.. జైపూర్‌‌‌‌ సిటీని యాచకుల లేని నగరంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. అందులో భాగంగా పోలీస్‌‌‌‌ కమిషనరేట్‌ పరిధిలో ఈ సర్వే జరిగింది. జైపూర్‌‌‌‌ ప్రాంతంలో మొత్తం 1162 మంది బెగ్గర్స్ ఉన్నట్లు సర్వేలో తేలింది. అయితే వాళ్లలో ఐదుగురు పోస్టు గ్రాడ్యుయేట్లు ఉన్నారు. ఇంకా షాకింగ్ ఏమిటంటే 193 మంది స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తిచేశారు. వీళ్లలో కొందరు ఇంగ్లీష్ కూడా మాట్లాడగలరు. మిగిలిన వారిలో 39 మంది హిందీ చదవగలరూ, రాయగలరు కూడా. మిగిలిన 903 మంది మాత్రం పాపం నిజంగానే చదువుకోలేదట. వాళ్లతో ఆ పని మాన్పించి వారి స్కిల్స్, ఇంట్రస్ట్‌‌‌‌ని బట్టి వాళ్లకి ఎదైనా పనిచేసుకుని బతికే అవకాశం చూపించాలని అనుకున్నారట. వీళ్లలో 117 మంది పనిచేసేందుకు సిద్ధమయ్యారు. 27 మంది స్కూల్స్, ఎడ్యుకేషన్‌లో పనిచేయటానికి ఇంట్రస్ట్ చూపించారు. ఇంకొంతమంది క్యాటరింగ్‌‌‌‌, క్రాఫ్స్ట్, హోటల్‌‌‌‌ లాంటి పనులు చేయటానికి రెడీ అని చెప్పారు. వారి వయస్సులపై కూడా సర్వే నిర్వహించారు. వారిలో 273 మంది 31 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్కులు, 259 మంది 41 నుంచి 50 ఏళ్ల వయస్సువారు, పదేళ్ల వయస్సు కంటే చిన్నవారు 52 మంది, 11 నుంచి 20 ఏళ్ల వయస్సు వారు 80 మంది ఉన్నారు. అయితే మిగతా 160 మంది మాత్రమే ఏ పనీ చేయడానికి ఇష్టపడలేదు.

For More News..

రాష్ట్రంలో కొత్తగా 2,214 కరోనా కేసులు

వడ్ల కొనుగోలు కేంద్రంలో గోల్​మాల్​.. రూ. 14 లక్షలు కొట్టేసిన మహిళ ఆపరేటర్

అధికారుల తప్పిదంతో మూడేళ్లుగా అందని రైతుబంధు

Latest Updates