ధోనీకి ప్రణామం.. కోహ్లీ ట్వీట్ వెనుక అసలు కథ..?

టీమిండియా స్కిప్పర్ విరాట్ కోహ్లీ… లెజెండరీ ప్లేయర్ మహేంద్రసింగ్ ధోనీని ఉద్దేశిస్తూ చేసిన ట్వీట్ వైరల్ అయింది. 2016లో ఇండియాలో జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లో ఓ సందర్భాన్ని గుర్తుచేస్కుంటూ విరాట్ కోహ్లీ ట్వీట్ చేశాడు.

“ఇది నేను ఎన్నటికీ మరిచిపోలేని గేమ్. అది చాలా స్పెషల్ నైట్. ఈ మనిషే… నన్ను ఓ ఫిట్ నెస్ పరీక్ష కోసం పరుగెత్తినట్టుగా పరుగెత్తించాడు.” అంటూ ధోనీని ఉద్దేశించి ఫొటో ట్వీట్ చేశాడు కోహ్లీ. ధోనీ రిటైర్మెంట్ వార్తల మధ్య… కోహ్లీ చేసి ఈ ట్వీట్ కొద్ది క్షణాల్లోనే  వైరల్ అయిపోయింది.

ఇది 2016 టీట్వంటీ వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్. సెమీస్ కు వెళ్లాలంటే చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్. ఆస్ట్రేలియా -ఇండియా మధ్య జరిగిన టఫ్ మ్యాచ్ అది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 160 రన్స్ భారీ స్కోరు చేసింది. 14 ఓవర్లకు 94/4 స్కోరు దగ్గర విరాట్ కోహ్లీకి … మహేంద్ర సింగ్ ధోనీ కలిశాడు. 6 ఓవర్లలో 67 రన్స్ చేయాల్సిన దశలో.. ధోనీ ..కోహ్లీకి ఎక్కువగా స్ట్రైకింగ్ ఇచ్చాడు. చివరి ఓవర్ లో 4 రన్స్ కావాల్సిన దశలో తొలి బంతినే ధోనీ బౌండరీ బాది విన్నింగ్ షాట్ కొట్టాడు. ఆ టైమ్ లో తీసిన ఫొటోనే ఇది. ఇండియా గెలవడంతో.. అప్పటి దాకా ఉన్న ప్రెషర్ తొలగిపోయిన కోహ్లీ.. గ్రౌండ్ పై రెండుకాళ్లతో మోకరిల్లి.. ధోనీకి నమస్కరించాడు. ఈ మ్యాచ్ లో కోహ్లీ 51 బాల్స్ లో 82 రన్స్ తో.. ధోనీ 10 బాల్స్ లో 18 రన్స్ తో నాటౌట్ గా నిలిచారు. డూ ఆర్ డై మ్యాచ్ ను గెలిచి సెమీస్ కు వెళ్లింది ఇండియా.

అందుకే.. ఫిట్ నెస్ టెస్టు లాగా ధోనీ నన్ను పరుగెత్తించాడు అంటూ అప్పటి ట్వీట్ చేశాడు కోహ్లీ.

ఐతే… విరాట్ కోహ్లీ ఈ ఫొటోను ఎందుకు షేర్ చేశాడో అంటూ రకరకాల ఊహాగానాలు చేస్తున్నారు అభిమానులు. 3రోజుల్లో సౌతాఫ్రికాతో టీట్వంటీ సిరీస్ మొదలుకానుంది. ఆ సిరీస్ లోనే ధోనీ ఇంటర్నేషనల్ క్రికెట్ కు గుడ్ బై చెబుతాడా.. దీనిపై కోహ్లీకి ముందే సమాచారం అందిందా.. అనే డౌట్స్ వస్తున్నాయి.

ఈ వార్త రాసే సమయానికే కోహ్లీ పోస్టును దాదాపు లక్షన్నర మంది లైక్ కొట్టారు. 2వేలకు పైగా కామెంట్స్ , 18వేల రీట్వీట్లు ఉన్నాయి.

Latest Updates