ఈ బాస్ ను ఇష్టపడని వాళ్లు ఎవరుండరు

షెల్డన్ ఎలెన్ ఒక కంపెనీకి సీఈవో. కంపెనీ బాగోగులతోపాటు ఉద్యోగుల బాగోగులు కూడా చూసుకుంటాడు. ప్రతీ ఒక్కరి పెర్ఫామెన్స్ ను గమనించి వాళ్లను మెచ్చుకుంటాడు. ఉద్యోగుల బర్త్ డేలు కూడా గుర్తుంచుకొ ని వాళ్లకు గ్రీటింగ్ కార్డ్స్ రాసి మరీ పంపుతాడు. వాళ్ల కంపెనీలో ఈ బాస్ ను ఇష్టపడని వాళ్లుండరు. అందరికీ ఫేవరెట్ గా మారిన బాస్ చెప్పిన విషయాలేంటంటే..

బెల్‌ ఫర్ హోల్డింగ్స్ అనేది ప్రాపర్టీ రిస్టోరేషన్ కంపెనీ. ఎలెన్ దీనికి సీఈవో. ఇతను తమ సంస్థలోని ఉద్యోగులందరి పుట్టిన రోజులను లి స్ట్ చేసుకొని, రోజుకి ఇరవై గ్రీటింగ్ కార్డ్స్ చొప్పున ఏడాది పొడవునా కార్డ్స్ ప్రిపేర్ చేస్తాడు. ఉద్యోగుల బర్త్ డే రాగానే వాళ్లకు కార్డు పంపి, విష్ చేస్తాడు. ఇలా ఎప్పటి నుంచో చేస్తూ కంపెనీలోని అందరి ఎంప్లాయిస్‌‌కు పాజిటివ్ ఫీలింగ్ కల్పిస్తున్నాడు.

అందరికీ ఇష్టం

ఎలెన్ ప్రవర్తన చాలా పా జిటివ్‌‌గా ఉంటుంది. కంపెనీలోని ఉద్యోగులందరినీ హ్యాపీగా ఉంచడం ఎలెన్ లక్ష్యం. ఉద్యోగులందరూ ‘ఈ సంస్థ మనది’ అని అనుకునేలా ఎలెన్ వాళ్లతో కలిసిపోతాడు. కంపెనీలో ఉన్న ప్రతి ఎంప్లాయ్‌ ని పర్సనల్‌ గా అప్రిషియేట్ చేస్తుంటాడు. అందుకే ఆ కంపెనీలో ‘బాస్’అంటే ఇష్టపడని వాళ్లుండరు.

కొత్త కాన్సెప్ట్ కాకపోయినా

బర్త్ డే కార్డులు ఇవ్వడం పా త కాన్సెప్ట్ అయినా దాని వాల్యూ మాత్రం ఎప్పటికీ కొత్తదే. ఎలెన్ 1986 నుం చి ఇలా బర్త్ డే కార్డులు ఇస్తూనే ఉన్నాడు. అయితే ‘ఇదంతా పా త పద్ధతి అని, ఈ మోడ్రన్ రోజుల్లో ఇలాంటి విధానాలు పనిచేయవు’ అనే వాళ్లున్ నారు. కానీ కొన్ని సర్వేల్లో ఇలా కార్డులి వ్వడం ద్వా రా ఉద్యోగుల్లో ఎంతో మార్పు వచ్చిందని తేలింది. సంస్థలోని ఉద్యోగులు కూడా ‘ఇలా కార్డులు తీసుకోవడం మాకు చాలా ప్రత్యేకం’ అంటున్నారు

ఎలా పనిచేసిందంటే

‘ఉద్యోగుల బాగోగుల కోసం ఎలెన్ ఎంచుకున్న కాన్సెప్స్ట్ ఎంతవరకు పనిచేశాయి? ఎంప్లాయ్స్‌‌లో ఎలాంటి మార్పు తీసుకొచ్చాయి?’ అని తెలుసుకోడానికి కొన్ని సంస్థలు స్టడీ కూడా చేశాయి. ఆ స్టడీలో 70 శాతం మంది ఉద్యోగులు..

మన బర్త్ డేని గుర్తు పెట్టు కొని ఫ్రెండ్ విష్ చేస్తేనే చాలా పొంగిపోతాం. అలాంటిది ఆఫీస్‌ లో బాస్ బర్త్ డేకి గ్రీటింగ్ పంపిస్తే.. అది కూడా తానే స్వయంగా రాసి పంపితే.. ఆ బాస్ చాలా స్పెషల్ కదూ! షెల్డన్ ఎలెన్ అలాంటి బాసే. ఇతను ‘బెల్‌‌ఫర్ హోల్డింగ్స్’ కంపెనీకి సీఈవో. ప్రతి ఏటా కంపెనీలోని వేలమంది స్టా ఫ్‌ కు తానే స్వయంగా బర్త్ డే కార్డు లు రాసి పంపిస్తా డు. ఇతని గ్రాటిట్యూడ్‌‌కి వాళ్ల ఉద్యోగులే కాదు ప్రపంచమంతా ఫిదా అవుతోంది.‘ఇప్పటి వరకు మాకు ఇంత మంచి గుర్తింపు ఎక్కడ దొరకలేదు’ అని చెప్పారు.83 శాతం మంది ఉద్యోగులు.. ‘మేము

చేస్తున్న పనికి సరైన గుర్తింపు కంటే కావాల్సింది ఇంకేముంది’ అని అన్నారు. 88 శాతం మంది ఉద్యోగులు.. బాస్ ఇస్తున్న  గుర్తింపు, గ్రాటిట్యూడ్ వల్ల తమలో మోటివేషన్ పెరిగిందని మరింత మెరుగ్గా పనిచేయడానికి

ఇది ఉపయోగపడుతుందని చెప్పారు. 90 శాతం మంది ఉద్యోగులు.. చేసే పనిని గౌరవించడం, గుర్తించడం వల్ల ఫ్రెండ్లీ వర్కింగ్ ఎన్విరాన్‌‌మెంట్ ఏర్పడిందని దానివల్ల వాళ్లు చాలా హ్యాపీగా పని చేసుకుంటు న్నట్టు చెప్పారు    వీటిని బట్టి పని చేసే చోట ఉద్యోగులకు , బాస్‌‌కు అందరికీ కామన్‌‌గా కావాల్సి న క్వాలి టీ ‘గ్రాటిట్యూడ్’ అని తేలింది. కృతజ్ఞతా భావం, గుర్తింపు వల్ల ఫ్రెండ్లీ వర్కింగ్ ఎన్విరాన్‌‌మెంట్ ఉంటుందని స్టడీలు తేల్చాయి.

అదే నిజమైన సక్సెస్

దీని గురించి ఎలెన్ మాట్లాడుతూ ‘‘ఉద్యోగులు మనకోసం పనిచేస్తున్నప్పుడు వాళ్ల కోసం మనమూ ఆలోచించడం అవసరం. ‘పనికి ఎంత డబ్బు ఇస్తున్నాం ’ అన్నదానికంటే ‘వాళ్లటైంను ఎంత క్వాలి టీ టైంగా మారుస్తున్నాం ’

అన్నది ముఖ్యం. నేను బర్త్ డే కార్డులు రాయడం 32 ఏళ్ళుగా చేస్తున్నా. ఇది నా డైలీ రొటీన్‌‌లో భాగమైపోయింది. కంపెనీ నా లైఫ్‌ లో భాగమైనప్పుడు దానికోసం పనిచేస్తున్న ఉద్యోగులు కూడా నా లైఫ్‌ లో భాగమే అని నేను ఫీలవుతాను. నేను ఇలా చేయడం వల్ల ఎంప్లాయిస్‌‌కి, నాకు మంచి కమ్యూనికేషన్ ఉంటుంది. ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్‌‌మెంట్ క్రియేట్ అవుతుంది. నిజానికి ఇది చాలా చిన్న పని. రోజుకి ఓ ఇరవై కార్డులు రాయడం పెద్ద కష్టమేమి కాదు. కానీ ఈ చిన్న పని వల్ల ఉద్యోగుల్లో  చాలా పా జిటివ్ ఫీలింగ్ కలుగుతుంది. ఇదొక్కటే కాదు ఉద్యోగుల పర్ఫార్మెన్స్ కూడా గమనిస్తుంటా.  అవసరమైనప్పుడు వాళ్లకు అప్రిషియేషన్ లెటర్స్ కూడా రాసి పంపిస్తుంటా. ఇలాంటివి చేయడం వల్ల ఉద్యోగులు మరింత మోటివేట్ అవుతారు. మోటివేషన్‌‌తో బెటర్ రిజల్ట్స్ వస్తాయి. ఎప్పుడైతే ఒక లీడర్ హ్యూమానిటీతో ఆలోచిస్తాడో అప్పుడు బిజినెస్‌‌తో పాటు లైఫ్‌ లోనూ సక్సెస్ అవుతాడు. తనని నమ్ముకున్న వాళ్ల సక్సెస్‌‌కు కూడా హెల్ప్ చేసిన వాడవుతాడు. బిజినెస్‌‌లో లాభాలు నష్టాలు అందరికీ వస్తాయి. అవి కంపెనీ గ్రోత్‌ ను డి సైడ్ చెయ్యవు. ఉద్యోగుల పనితీరు,పనిచేసే వాతావరణమే కంపెనీ సక్సెస్‌‌కు కారణమవుతుంది” అని అన్నారాయన.

గ్రాటిట్యూడ్ అంటే..

లీడర్‌‌‌‌షిప్ క్వాలి టీస్‌‌లో గ్రాటిట్యూడ్ కూడా ఒకటి. గ్రాటిట్యూడ్ అంటే చేసిన ఉపకారాన్ని మర్చిపోకుండా ఉండటం, చేసే పని పట్ల సానుభూతి కలిగి ఉండడం. ఈ క్వాలి టీ లీడర్‌‌‌‌తో పాటు తనని ఫాలో అయ్యే వాళ్ల ఎదుగుదలకు కూడా సహకరిస్తుంది. సరైన గ్రాటిట్యూడ్ లేకపోతే నాయకుడిగా ఎదగలేరు. ఒకవేళ ఎదిగినా ఎక్కువ కాలం నిలవలేరు. ఒక్క లీడర్‌‌‌‌కి మాత్రమే కాదు గ్రాటిట్యూడ్ అందరికీ అవసరమే. జీవితాన్ని ఆనందంగా మలచుకోవడానికి గ్రాటిట్యూడ్ చాలా హెల్ప్ చేస్తుంది. ప్రతి ఒక్కరూ తమ జర్నీలో భాగమైన వాళ్లం దరి పట్ల గ్రాటిట్యూడ్‌‌తో ఉండాలి. తల్లిదండ్రులు, టీచర్స్, ఫ్రెండ్స్, ఆఖరికి శత్రువుల పట్ల కూడా గ్రాటిట్యూడ్ ఉండాలి. కష్టాల్లో ఉన్నప్పుడు కృతజ్ఞత కలిగి ‌ఉండడం మామూలే. సక్సెస్‌‌లోనూ కృతజ్ఞత చూపించాలి. అప్పుడే అది నిజమైన గ్రాటిట్యూడ్ అనిపించుకుంటుంది.

Latest Updates