యూఎస్ ఓపెన్ కు బెలిండా దూరం

న్యూఢిల్లీ: స్విట్జర్లాండ్ మహిళల టెన్నిస్ స్టార్ బెలిండా బెన్సిచ్‌‌‌‌‌‌‌‌​ యూఎస్ ఓపెన్ నుంచి తప్పుకుంది. కరోనా మహమ్మారి ముప్పు ఉండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బెలిండా ట్విటర్ ద్వారా ప్రకటించింది. దీంతో టాప్ టెన్ లో ఐదుగురు ప్లేయర్లు ఈసారి టోర్నీకి దూరమయ్యారు. గతేడాది యూఎస్ ఓపెన్ లో సెమీఫైనల్ కు చేరినబెన్సిచ్‌‌‌‌‌‌‌‌.. వరల్డ్​ ర్యాంకిం గ్స్ లో ప్రస్తుతం ఎనిమిదో స్థానంలో ఉంది. ఇక వరల్డ్​ నంబర్ వన్ యాష్ బార్టీ, ఆరో ర్యాంకర్ ఆండ్రెస్క్యూ తోలినా(ఐదో ర్యాంక్), కికి బెర్టెన్స్ (ఏడో ర్యాంకర్) టోర్నీకి దూరంగా ఉంటున్నట్లు ఇదివరకే ఇదివరకే ప్రకటించారు. కాగా, ఈ నెల 31 నుంచి న్యూయార్క్​ వేదికగా యూఎస్ ఓపెన్ జరగనుంది.

Latest Updates