యాపిల్ సిడార్ వెనిగర్..మంచిదేకానీ చూసి తాగండి

యాపిల్‌‌‌‌‌‌‌‌ సిడార్‌‌‌‌‌‌‌‌ వెనిగర్‌‌‌‌‌‌‌‌ అనారోగ్య సమస్యలెన్నింటికో చెక్‌‌‌‌‌‌‌‌ పెట్టే ‘మిరకిల్‌‌‌‌‌‌‌‌ మంత్ర’ అంటారు. సన్‌‌‌‌‌‌‌‌బర్న్‌‌‌‌‌‌‌‌, మొటిమల సమస్యల నుంచి మొదలుపెట్టి బరువు తగ్గించడంలో, క్యాన్సర్‌‌‌‌‌‌‌‌ రాకుండా నిరోధించడంలో… తోడ్పడుతుంది. ఇంకో సీక్రెట్‌‌‌‌‌‌‌‌ ఏంటో తెలుసా! చాలామంది డాక్టర్లు వెనిగర్‌‌‌‌‌‌‌‌ను తెగ ప్రేమించేస్తారు. అయితే… ఇందులో ఎన్నో లాభాలు ఉన్నాయనే విషయంలో సైంటిఫిక్‌‌‌‌‌‌‌‌గా ప్రూఫ్స్‌‌‌‌‌‌‌‌ మాత్రం లేవు.

యాపిల్ సిడార్‌‌‌‌ను పులియబెడితే (ఫర్మెంట్‌‌‌‌ చేస్తే)యాపిల్‌‌‌‌ సిడార్‌‌‌‌ వెనిగర్‌‌‌‌ తయారవుతుంది. ఈ ప్రాసెస్‌‌‌‌లో యాపిల్స్‌‌‌‌ను ఈస్ట్‌‌‌‌ వేసి ఫర్మెంట్‌‌‌‌ చేస్తారు. ఆ తరువాత సిడార్‌‌‌‌కు కలిపి, ఆల్కహాల్‌‌‌‌లో వేశాక వెనిగర్‌‌‌‌లో కలుపుతారు. అలా తయారైన యాపిల్ సిడార్‌‌‌‌ వెనిగర్‌‌‌‌  బ్లడ్‌‌‌‌ షుగర్‌‌‌‌ను, డయాబెటిస్‌‌‌‌ను కంట్రోల్‌‌‌‌లో ఉంచుతుంది. అంతేనా పురుగూపుట్రా, తేనెటీగలు కుట్టినా ఇది రాసుకుంటే చాలు. చాలా రిలీఫ్‌‌‌‌గా ఉంటుంది. రకరకాల హెల్త్‌‌‌‌ బెనిఫిట్స్‌‌‌‌ ఉన్నాయి కదా అని… అదేపనిగా తీసుకోకూడదు. యాపిల్‌‌‌‌ సిడార్ వెనిగర్‌‌‌‌ తాగేందుకు కొన్ని రూల్స్‌‌‌‌ అండ్‌‌‌‌ రెగ్యులేషన్స్‌‌‌‌ ఉన్నాయి మరి. అవేంటంటే…

అందులో కలిపి…

ఏ రకం వెనిగర్‌‌‌‌ అయినా రుచి  బాగుంటుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. అందుకే చాలామంది యాపిల్‌‌‌‌ సిడార్‌‌‌‌ వెనిగర్‌‌‌‌ను ఎందులో కలపకుండా నేరుగా తాగుతారు. ఆ తరువాత నోరు  చేదుగా ఉందని, తాగిన వెంటనే ఏదో ఒకటి తింటారు. ఇలా చేయడం వల్ల మంచి కంటే చెడు జరిగే అవకాశం ఎక్కువ. ఎందుకంటే ఇందులో ఎక్కువ మొత్తంలో ఎసిటిక్‌‌‌‌ యాసిడ్‌‌‌‌ ఉంటుంది. దీని ప్రభావం  పొట్ట, అన్నవాహికల మీద పడుతుంది. అంతేకాదు నేరుగా తాగడం వల్ల గొంతు దెబ్బతినే ప్రమాదమూ ఉంది. అందుకని వెనిగర్‌‌‌‌ను నీళ్లలో లేదా ఏదైనా పండ్ల రసంలో కలిపి తాగాలి. ఒక వంతు వెనిగర్‌‌‌‌ను పదొంతుల నీళ్లలో కలిపి తాగాలని చెప్తున్నారు ఎక్స్‌‌‌‌పర్ట్స్‌‌‌‌.

కూర్చునే ఉండాలి

పైన చెప్పినట్టు డైల్యూట్‌‌‌‌ చేసిన వెనిగర్‌‌‌‌ను తాగేందుకు కూడా ఒక టైం ఉంది. మరీ ముఖ్యంగా పడుకునే ముందు అస్సలు తాగొద్దు. అలా కానీ తాగితే మీరు బెడ్‌‌‌‌ మీద పడుకోగానే యాపిల్‌‌‌‌ సిడార్‌‌‌‌ వెనిగర్‌‌‌‌ వెనక్కి అంటే అన్నవాహికలోకి వచ్చే ప్రమాదం ఉంది. రోజులో ఎప్పుడు వెనిగర్‌‌‌‌ తాగినా… అన్నవాహిక మీద యాసిడ్ ఎఫెక్ట్‌‌‌‌ పడకుండా ఉండాలంటే… తాగిన వెంటనే నడుం వాల్చొద్దు.

అలా వద్దే వద్దు

ఖాళీ కడుపున తాగితే యాపిల్‌‌‌‌ సిడార్‌‌‌‌ వెనిగర్‌‌‌‌ చాలా బాగా పనిచేస్తుంది. ఇలా తాగడం వల్ల జీర్ణక్రియ బాగుండటమే కాకుండా బరువు కూడా తగ్గుతారు. అయితే తిన్న వెంటనే యాపిల్‌‌‌‌ సిడార్‌‌‌‌ వెనిగర్‌‌‌‌ తాగొద్దు. అలా తాగితే వెనిగర్‌‌‌‌లో ఉండే ఎసిటిక్‌‌‌‌ ప్రభావం వల్ల జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. అందుకని భోజనం చేశాక 20 నిమిషాలు ఆగి ఆ తరువాతే యాపిల్ సిడార్‌‌‌‌ వెనిగర్‌‌‌‌ తాగాలి.

వాసన చూడొద్దు

కొంతమందికి తినేదైనా, తాగేదైనా వాసన చూసే అలవాటు ఉంటుంది. అలాంటి వాళ్లు ఈ వెనిగర్‌‌‌‌ను తాగేటప్పుడు దాని వాసన పీల్చడం లేదా శ్వాస లోపలికి తీసుకోవడం వంటివి చేయొద్దు. అలా చేస్తే… వెనిగర్‌‌‌‌ వాసన ఊపిరితిత్తుల్లో మంట పుట్టేలా చేస్తుంది. ఒక్కోసారి అంతకంటే ఎక్కువ హాని కలిగే అవకాశమూ ఉంది.

తాగి… ఆగి…

యాపిల్‌‌‌‌ సిడార్‌‌‌‌ వెనిగర్‌‌‌‌ మీ శరీరానికి అద్భుతమైన ఫలితాలిస్తుంది.  అలాగని అదేపనిగా తాగొద్దు. మంచి ఎక్కువైనా సమస్యే.  మొదటిసారి తాగుతుంటే కనుక మీ శరీరం దాన్ని  అడాప్ట్‌‌‌‌ చేసుకుందా లేదా గమనించాలి. పడకపోతే కడుపు నొప్పి రావొచ్చు. అందుకని మొదట కొద్ది మొత్తంలో తాగాలి. పర్లేదు… బాగానే ఉంది అనిపిస్తే కంటిన్యూ చేయొచ్చు. అలా కూడా ఒకేసారి రెండు టేబుల్‌‌‌‌స్పూన్స్‌‌‌‌ కంటే ఎక్కువ తీసుకోవద్దు.

Latest Updates