బెంగాల్ బీజేపీ నేత కూతురి కిడ్నాప్

లాభ్ పూర్: పశ్చిమ బెంగాల్ లో ఓ బీజేపీ నేత కుమార్తెను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. నేరుగా ఇంట్లోకి వచ్చి తుపాకీతో బెదిరించి ఆమెను లాక్కెళ్లారు. బిర్భూమ్ జిల్లా లాభ్ పూర్ ప్రాంతానికి చెందిన సుప్రభాత్ బత్యాబిల్ ఐదు నెలల క్రితమే తృణమూల్ కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి మారారు. శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో ఐదుగురు దుండగులు ముసుగులు వేసుకుని ఇంట్లో చొరబడ్డారు. 22 ఏళ్ల కుమార్తెకు తుపాకీ పెట్టి బెదిరించి ఆమెను లాక్కెళ్లారు. అంతకు ముందుగానే ఆమె బాబాయ్, తమ్ముడు మరో గదిలో ఉండడం చూసి వారు బయటకు రాకుండా ఆ గది తలుపు లాక్ చేశారు. ఈ ఘటన జరిగినప్పుడు సుప్రభాత్ ఇంట్లో లేరు.

ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ శ్యామ్ సింగ్ చెప్పారు. ఇందులో రాజకీయ కోణం లేదని చెప్పారు.

Latest Updates