ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌బోతే అడ్డుకుంటున్నారు: ఎంపీ ఆవేద‌న‌

తన నియోజక వర్గంలోని ప్రజలకు సేవ చేసేందుకు పోలీసులు అనుమతించటం లేదంటూ పశ్చిమ బెంగాల్ లో ఒక బీజేపీ ఎంపీ నిర‌స‌న వ్య‌క్తం చేశారు. తృణమూల్ ప్రభుత్వం బీజేపీ నేత‌ల‌ను వేధింపులకు గురి చేస్తోందంటూ లాక్ డౌన్ వేళ రోడ్డుపై బైఠాయించారు.

దక్షిణ్ దీనాజ్ పూర్ లోక్ సభ నియోజక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సుకుంటా మజుందార్ ను లాక్ డౌన్ కారణంగా తన సొంత నియోజక వర్గంలోకి పోలీసులు అనుమతించటం లేదు. గత కొన్ని రోజులుగా నియోజక వర్గంలోకి వెళ్దామ‌ని ప్ర‌య‌త్నించిన ప్ర‌తీ సారి పోలీసులు అడ్డుకుంటున్నారు.

దీంతో ఆయ‌న బలూర్ఘాట్ లోని స్థానిక పోలీస్ స్టేషన్ కు త‌న‌ను అడ్డుకోవ‌డానికి కార‌ణాలు తెల‌పాల‌ని ఓ లెట‌ర్ రాశారు. పోలీసులు మాత్రం లాక్ డౌన్ నిబంధ‌నలు ఉల్లంఘించ‌కూడ‌ద‌న్న ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగానే తాము విధులు నిర్వర్తిస్తున్నామని చెబుతున్నారు.

Latest Updates