ఆవుల్నిపెట్టుకో.. గోల్డ్‌‌‌‌‌‌‌‌ లోన్‌‌‌‌‌‌‌‌ ఇవ్వు

మన జాతి ఆవుల పాలల్లో బంగారం ఉందని పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ సంచలన కామెంట్స్‌‌‌‌‌‌‌‌ చేసిన విషయం తెలుసు కదా. ఆయన అట్ల అన్నడో లేదో అదే రాష్ట్రంలోని దన్‌‌‌‌కునికి చెందిన ఓ వ్యక్తి తన రెండు ఆవులను పట్టుకొని మణప్పరం ఫైనాన్స్‌‌‌‌‌‌‌‌కు వెళ్లాడు. వాటిని పెట్టుకొని లోన్‌‌‌‌‌‌‌‌ ఇవ్వమని అడిగాడు. ఆవు పాలల్లో గోల్డ్‌‌‌‌‌‌‌‌ ఉంటుందని ఈ మధ్యే విన్నానని, రెండు ఆవులను పెట్టుకొని లోనిస్తే తన వ్యాపారం పెద్దగ చేస్తానని చెప్పాడు. ఆయన మాటలు విన్న మణప్పరం ఉద్యోగులు ఏమనాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయారు. ఘోష్‌‌‌‌‌‌‌‌ వ్యాఖ్యలపై బెంగాల్‌‌‌‌‌‌‌‌లోని గరల్‌‌‌‌‌‌‌‌గచా గ్రామ ప్రధాన్‌‌‌‌‌‌‌‌ మనోజ్‌‌‌‌‌‌‌‌సింగ్‌‌‌‌‌‌‌‌ తీవ్రంగా స్పందించారు. రైతులు రోజూ తనదగ్గరకొచ్చి.. ‘మా ఆవులు రోజుకు 15 నుంచి 16 లీటర్ల పాలిస్తాయి. పాలల్లో బంగారం ఉంటదంట కదా. మరి ఆవులపై ఎంత గోల్డ్ లోన్ వస్తుంది?’ అని అడుగుతున్నారన్నారు. ఆవు పాలల్లో బంగారం ఉందన్న ఘోష్‌‌‌‌‌‌‌‌కు నోబెల్ ప్రైజ్‌‌‌‌‌‌‌‌ ఇవ్వాలని ఎద్దేవా చేశారు.

 

Latest Updates