బెంగాల్ ఎవరి ముందు తలవంచదు

శాస్త్రీయ, సాంస్కృతిక అభివృద్ధిలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ గా ఉందన్నారు సీఎం మమతా బెనర్జీ. తమ రాష్ట్రం ఇతరుల ముందు ఎప్పటికీ తలవంచబోదని స్పష్టం చేశారు. 25వ కోల్ కతా అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మమత మాట్లాడారు. రాష్ట్రానికి చెందిన సినిమా డైరెక్టర్లు దశాబ్దాలుగా సమగ్రత, ఐక్యత సందేశాలను చాటుతున్నారని ప్రశంసించారు.

అవార్డులు తెచ్చే చిత్రాలను రూపొందించే దర్శకులు, ప్రతిష్ట్రాత్మక నోబెల్ పురస్కారాలను పొందినవారు కూడా తమ రాష్ట్రం నుంచే ఎక్కువ మంది ఉన్నారని తెలిపారు. అయితే వేరేవారిపై తమకు అసూయ లేదని… ప్రతీ ఒక్కరితో సానుకూలంగానే వ్యవహరిస్తామని చెప్పారు. జీవితకాలం పోరాడతాం కానీ ఇతరుల ముందు ఎట్టి పరిస్థితిలోనూ తలవంచబోమని తేల్చిచెప్పారు దీదీ.

Latest Updates