టాస్ గెలిచిన కొహ్లీ.. హైదరాబాద్ బ్యాటింగ్

ఐపీఎల్ సీజన్ 12 లో లాస్ట్ మ్యాచ్ ఆడుతున్న బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ లో బెంగళూరు టాస్  గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఇప్పటి వరకు  13 మ్యాచ్ లు ఆడి నాలుగు మ్యాచ్ లు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో చివర ఉన్న బెంగళూరు ప్లే ఆఫ్ అవకాశాలు ఎప్పుడో చేజార్చుకుంది.  అయితే సన్ రైజర్స్ ఈ మ్యాచ్ గెలవడం తప్పని సరి. ఇప్పటి వరకు 13 మ్యాచ్ లు ఆడి ఆరు గెలిచి 12 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది సన్ రైజర్స్. ప్లే ఆఫ్ కు వెళ్లాలంటే ఈ మ్యాచ్ తప్పకుండా గెలవాలి. ఓడిపోతే ఇంటికి వెళ్లాల్సిందే.

 

 

Latest Updates