స్విమ్మింగ్ పూల్ అడుగున నకిలీ బంగారం బిస్కెట్లు

స్విమ్మింగ్ పూల్ లో 303 కేజీల నకిలీ బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు బెంగుళూరు పోలీసులు. బెంగుళూరు నగరానికి చెందిన ఐఎంఎ వ్యవస్థాపకుడు మన్సూర్ ఖాన్ నివాసంలో తనిఖీలు చేపట్టిన స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీమ్ ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. అతని నివాసంలోని స్విమ్మింగ్ పూల్ అడుగు భాగంలో ఈ బిస్కెట్లను దాచినట్టు వారు గుర్తించారు. అయితే ఈ నకిలీ బంగారాన్ని ఎందుకోసం దాచారు? ఎక్కడికైనా అక్రమంగా తరలించేందుకు ఉంచారా? అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో వసీమ్ అనే వ్యక్తిని వారు అదుపులోకి తీసుకున్నారు.

Latest Updates