న‌టి సంజ‌న ఇంట్లో సోదాలు

బెంగ‌ళూరు:  కన్నడ ఇండస్ట్రీని డ్రగ్స్ వ్యవహారం కుదిపేస్తోంది. డ్రగ్స్ కేసులో హీరోయిన్ సంజన ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు సెంట్రల్  క్రైం బ్రాంచ్ పోలీసులు. ఇదే వ్యవహారంలో ఇప్పటికే ఆమె ఫ్రెండ్ రాహుల్ శెట్టిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. అతడు చెప్పిన సమాచారంతో మంగళవారం  సంజన ఇంట్లో సోదాలు చేశారు CCB అధికారులు.

డ్రగ్స్ కేసులో ఇప్పటికే హీరోయిన్ రాగిణి ద్వివేదీని అరెస్టు చేశారు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు. ముందుగా ఆమె ఫ్రెండ్ రవిని అదుపులోకి తీసుకుని… అతనిచ్చిన సమాచారంతో రాగిణిని అరెస్ట్ చేశారు. శాండల్ వుడ్ మరింత మంది సెలబ్రెటీలు డ్రగ్స్ కు బానిసలయ్యారనే ఆరోపణలొస్తున్నాయి. ఇప్పటికే డ్రగ్స్ తీసుకుంటున్న 20 మంది సెలబ్రెటీల వివరాలను పోలీసులకిచ్చారు డైరెక్టర్ ఇంద్రజిత్.

Latest Updates