మహిళకు కరోనా : అంబులెన్స్ కోసం 8 గంటలు రోడ్డుపైనే ఎదురు చూపులు

కరోనా వైరస్ కేసులు పెరిగి పోతుండడంతో బాధితులకు ట్రీట్ మెంట్ అందడం లేదు. కనీసం ఇంటి నుంచి ఆస్పత్రి తరలించే ప్రయత్నం జరగడం లేదు. కరోనా వైరస్ సోకిన బాధితురాలు ఆస్పత్రికి వెళ్లేందుకు అంబులెన్స్ కోసం సుమారు 8 గంటల పాటు రోడ్డు పై  ఎదురు చూసింది .

బెంగళూరుకు చెందిన ఓ మహిళకు కరోనా వైరస్ లక్షణాలు గుర్తించిన ఆమె కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. మధ్యాహ్నం 1గంట ప్రాంతంలో ఆస్పత్రికి పంపించేందుకు అంబులెన్స్ కు కాల్ చేశారు. అనంతరం హోం క్వారంటైన్ కి వెళ్లారు. అంబులెన్స్ అంటే పది, పదిహేను నిమిషాలు టైం లో వస్తుందని భావించిన బాధితురాలు ఇంటికి ఎదురుగా ఉన్న రోడ్డు పై ఎదురు చూసింది. ఇలా ఏకంగా 8 గంటల పాటు ఎదురు చూసింది. మధ్యాహ్నం 1గంటకు కాల్ చేస్తే సాయంత్రం 9గంటలకు అంబులెన్స్ వచ్చిందని ఆమె కుటుంబసభ్యులు ఎన్డీటీవీకి తెలిపారు. ప్రస్తుతం ఆమెకు ట్రీట్ జరుగుతుందని, టైం టూ టైం డాక్టర్లు చెక్ చేస్తున్నారని చెప్పారు.

Latest Updates