ట్రాఫిక్ రూల్స్ పాటించడంలో మనోడు ఘనుడు

బెంగళూరు: రోడ్డు పై వాహనాలు నడిపేటప్పుడు తప్పకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఎంత మొత్తుకున్నా కొందరు పట్టించుకోరు. హెల్మెట్ లేకుండా బండ్లు నడుపుతూ, సిగ్నల్స్ జంప్ చేస్తూ ఎక్కడో ఒక చోట పోలీసులకు దొరికిపోతుంటారు. ఇలాగే కర్నాటకలోని బెంగళూరులో ఓ టూ వీలర్ డ్రైవర్  పోలీసులకు దొరికాడు. ఇందులో వింతేం ఉందంటారా.. సదరు వ్యక్తి చాన్నాళ్లుగా చలానాలు కట్టకుండా, ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా డ్రైవింగ్ చేస్తున్నాడు. బెంగళూరులోని మదివలాకు చెందిన సదరు వ్యక్తిని ట్రాఫిక్ ఎస్సై అర్జున్ కుమర్ రెగ్యులర్ తనిఖీల్లో భాగంగా ఆపారు. అతడి ట్రాఫిక్ ఉల్లంఘనల చిట్టాను చూసి పోలీసులు షాకయ్యారు. సదరు వ్యక్తిపై బండిపై ఏకంగా 77 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నమోదై ఉండటంతో ఆశ్చర్యపోయారు. అన్ని చలాన్లకు కలిపి రూ. 42,500 ఫైన్ వేశారు. ఇక్కడ మరో వింతేంటంటే.. మనోడి ఫైన్ కంటే నడిపే బండి ఖరీదు తక్కువ. అతడి బండి ఖరీదు రూ.20 వేలు. అతడి సెకండ్ హ్యాండ్ స్కూటర్‌‌ను రూ. 20 వేల ఫైన్ కింద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Latest Updates