హైదరాబాద్: ఓయో హోటల్ లో బెంగళూరు వ్యక్తి సూసైడ్

హదరాబాద్: బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్ ఓయో హోటల్ లో సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన మంగళవారం పొద్దున జరిగింది. బెంగళూరుకు చెందిన శ్రీవాత్సవ అనే వ్యక్తి సోమవారం రాత్రి 1.30నిమిషాలకు హైదరాబాద్ లో  శంషాబాద్ లోని ఓయో హోటల్ లో రూమ్ తీసుకున్నాడు. రూమ్ నెంబర్ 106. మంగళవారం పొద్దున హోటల్ సిబ్బంది రూమ్ డోర్ నాక్ చేయడంతో ఎంతకీ డోర్ ఓపెన్ చేయలేదు. దీంతో లాక్ బ్రేక్ చేసి చూడగా శ్రీవాత్సవ మృతిచెంది ఉన్నట్లుగా హోటల్ సిబ్బంది గుర్తించారు. అంతలోనే శ్రీవాత్సవ ఫోన్ కు కాల్ రాగా లిఫ్ట్ చేశారు. బెంగళూరు పోలీసులు ఫోన్ చేసినట్లు తెలుసుకున్న హోటల్ సిబ్బంది శ్రీవాత్సవ చనిపోయినట్లు చెప్పారు. అయితే శ్రీవాత్సవపై మిస్సింగ్ అయినట్లు కేసు నమోదు అయినట్లు చెప్పారు పోలీసులు. లోకల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Latest Updates