మద్యం తాగి రాష్ డ్రైవింగ్..జూబ్లీహిల్స్ లో క్యాబ్ ను ఢీ కొట్టిన బెంజ్ కారు

హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 3 లో కారు బీభత్సం సృష్టించింది. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు నుంచి వేగంగా వచ్చిన బెంజ్ కారు ఇండికా క్యాబ్ ను ఢీ కొట్టింది. దీంతో ఇండికాలో ఉన్న ఇద్దరికి తీవ్ర గాయలయ్యాయి. పీకలదాకా మద్యం తాగి రాష్ డ్రైవింగ్ చేయడంతోనే ప్రమాదం జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. బెంజ్ కారును డ్రైవ్ చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాయల్ టిఫిన్ సెంటర్ దగ్గర డేంజర్ స్పాట్ ఉందని…ఇక్కడ రోజూ ప్రమాదాలు జరుగుతున్నాయని అంటున్నారు జనం. స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Latest Updates