మగవాళ్ల స్కిన్ గ్లో, యంగ్ లుక్ కోసం టిప్స్

యాంటీ ఏజింగ్.. వయసు పెరుగుతున్నా ఎప్పటికీ యంగ్ లుక్‌తో కనిపించడం! స్కిన్‌లో ఏ మాత్రం గ్లో తగ్గకుండా అందంగా కనిపించాలని కోరుకోకుండా ఎవరుంటారు? అందం అంటే ఆడవారికి మాత్రమేనా? కాదు, మగవాళ్లూ అందమైన లుక్ కోరుకుంటారు. యాంటీ ఏజింగ్ కాస్మోటిక్ ట్రీట్మెంట్లు ఇప్పుడు మగవాళ్లు కూడా చేయించుకుంటున్నారు. అసలు కత్తిగాటు పడకుండా, సర్జరీతో పని లేకుండా యంగ్ లుక్ సొంతమయ్యే చికిత్సలు వచ్చేశాయి. వాటిలో బొటాక్స్ ఒకటి. తరచూ ప్రొటీన్ ఇంజెక్షన్ల ద్వారా ముడతలు రాకుండా, అతిగా చెమటలు పట్టకుండా చేసే విధానమిది. అలాంటి మరో ప్రొసీజర్ మైక్రోడెర్మాబ్రసన్. ఓ చిన్న మెడికల్ టూల్ ద్వారా చర్మం ఔటర్ లేయర్‌పై పొల్యూషన్ కారణంగా పేరుకుపోయిన టాక్సిన్, డార్క్ స్పాట్స్, డెడ్ సెల్స్ తొలగిస్తారు. ఈ విధానంలో గ్లో పెరగడంతో పాటు చర్మ కణాల్లో కొత్త జీవం వస్తుంది.

కెమికల్ పీల్ ట్రీట్మెంట్ మరో ముఖ్యమైన యాంటీ ఏజింగ్ ప్రాసెస్. సబ్బు నురగ లాంటి కెమికల్ ఫోమ్‌ను చర్మంపై పూసి పింపుల్స్ మచ్చలు, మడతలను తొలగిస్తారు. స్కిన్ డ్యామేజ్‌ను బట్టి ఈ ట్రీట్మెంట్ చేసే విధానం మారుతుంది. గాయాలైనప్పుడు పడే మచ్చలను కూడా తొలగించే ట్రీట్మెంట్ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ప్రాసెస్. దీని ద్వారా చర్మాన్ని సహజం మారుస్తారు. ఇక రకరకాల లేజర్ ట్రీట్మెంట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ కొంత ఖర్చుతో కూడుకున్నవి. అసలు వీటితో పని లేకుండా సహజంగా చర్మాన్ని కాపాడుకోవడం ఎంతో మేలు. అలాంటి కొన్ని టిప్స్ ఓ సారి చూద్దాం.

  • నీళ్లు ఎక్కువగా తాగాలి. చర్మం పొడిబారకుండా చూసుకుంటే గ్లో తగ్గదు.
  • పచ్చి కూరగాయలు, పండ్లు ఎక్కువగా తినడం ద్వారా శరీరానికి మంచి మినరల్స్, ప్రొటీన్స్ అందుతాయి. దీనికి మించిన యాంటీ ఏజింగ్ మెడిసిన్ లేదు.
  • ఆయిల్, మసాలా ఫుడ్స్ తగ్గించాలి.
  • టీ, కాఫీలు, ఆల్కహాల్ వీలైనంత తక్కువగా తీసుకుంటే మేలు. వీటిని ఎక్కువగా తీసుకుంటే వృద్ధాప్య ఛాయలు ముందే వచ్చేసే చాన్స్ ఉందని అనేక పరిశోధనలు చెబుతున్నాయి.
  • అందంగా ఉండాలనుకునే వాళ్లు పొగ తాగడం పూర్తిగా మానేయాలి. లేదంటే పింపుల్స్ ఎక్కువగా వస్తాయి.
  • రోజులో రెండు మూడు సార్లు ఫేస్ వాష్ చేసుకోవాలి. దీనివల్ల ముఖంపై వ్యర్థాలు పేరుకునిపోకుండా చూసుకోవచ్చు.
  • పొల్యూషన్, దుమ్ము, ఎండ నుంచి చర్మాన్ని కాపాడుకోవడానికి బయటకు వెళ్లేటప్పుడు సన్‌ స్క్రీన్ క్రీములు పూసుకోవడం మేలు.
  • రెగ్యులర్‌గా వ్యాయామం చేయడం ద్వారా వయసు మీదపడినా కొంత వరకు దాని ఎఫెక్ట్స్ బయటపడకుండా చూసుకోవచ్చు.

Latest Updates