బడ్జెట్ స్మాల్.. వాచీ స్మార్ట్.

best-cheap-smart-watches-on-small-budget

రెగ్యులర్ వాచీలకు బదులుగా స్మార్ట్​ వాచ్​లు ధరించడం లేటెస్ట్​ ట్రెండ్. స్మార్ట్​వాచ్​లు అనగానే చాలా ఖరీదైనవే అనుకుంటారు. కానీ, తక్కువ బడ్జెట్​లో.. అంటే రెండు, మూడు వేల రూపాయల్లోపే వచ్చే స్మార్ట్​వాచ్​లు కూడా మార్కెట్లో దొరుకుతున్నాయి. వీటిలో బ్రాండెడ్​ కంపెనీల వాచ్​లు కూడా ఉండటం విశేషం. స్టైలిష్​ లుక్​ను అందించే స్మార్ట్​ వాచ్​లంటే ఆసక్తి ఉండి, తక్కువ ధరలో కావాలనుకునే వాళ్లు వీటిని ట్రై చేయొచ్చు.

ఎమ్​ఐ హెచ్​ఆర్​ఎక్స్​

షావోమి సంస్థ నుంచి రెండు స్మార్ట్​ వాచ్​లు బడ్జెట్​లో దొరుకుతున్నాయి. వాటిలో ‘ఎమ్​ఐ హెచ్​ఆర్​ఎక్స్​ ఎడిషన్’ ఒకటి. ఇది బేసిక్​ మోడల్. ధర సుమారు పన్నెండు వందల రూపాయలు. ఓఎల్​ఈడీ డిస్​ప్లే, వాటర్​ రెసిస్టెన్స్​ కలిగి ఉంది. ఈ సంస్థ నుంచి వచ్చిన మరో మోడల్​‘ఎమ్​ఐ బ్యాండ్​3’. దీని ధర సుమారు రెండు వేల రూపాయలు. హార్ట్​ రేట్​ మానిటరింగ్, స్లీప్,  స్టెప్​ ట్రాకింగ్, యాక్టివిటీ ట్రాకర్​ వంటి ఫీచర్లున్నాయి. ఆండ్రాయిడ్,  ఐఓఎస్​ మొబైళ్లతో కనెక్ట్​ చేసుకోవచ్చు.

 

 

ఆనర్​  బ్యాండ్​ 4

ఆనర్​ సంస్థ నుంచి విడుదలైన ‘ఆనర్​ బ్యాండ్​ 4’ బడ్జెట్​స్మార్ట్​ వాచ్. మూడు వేరియంట్లలో లభిస్తున్న ఇది అమోల్డ్​ ఫుల్​ కలర్​ డిస్​ప్లే, వాటర్​ రెసిస్టెన్స్​ కలిగి ఉంది. కేలరీ బర్న్​ కౌంట్,  స్లీప్,  స్టెప్,  డిస్టెన్స్​ కౌంట్​ వంటి ఫీచర్లున్నాయి. కాల్​ మెసేజ్​ నోటిఫికేషన్లు అందిస్తుంది. ధర సుమారు రెండున్నర వేల రూపాయలు.

 

నాయిస్​ కలర్​ఫిట్​

‘నాయిస్​ కలర్​ఫిట్​ స్మార్ట్​ వాచీ’ తక్కువ ధరలో అందుబాటులో ఉంది. మూడు రంగుల్లో దొరుకుతుంది. ఏడు రోజుల బ్యాటరీ కెపాసిటీ, బిగ్​ డిస్​ప్లే, గొరిల్లా గ్లాస్,  వాటర్​ రెసిస్టెన్స్​ కలిగి ఉంది. ఔట్​డోర్, ఇన్​డోర్​ ఫిట్​నెస్​ ట్రాకర్​గా పని చేస్తుంది. ధర సుమారు మూడు వేల రూపాయలు.

 

 

రాన్

ఫ్యాషన్  బ్రాండ్​ ‘రాన్’  నుంచి తక్కువ ధరలోనే స్మార్ట్​వాచ్​లు లభిస్తున్నాయి. ఓఎల్​ఈడీ డిస్​ప్లే, వాటర్​ రెసిస్టెన్స్​ కలిగి ఉన్నాయి. స్లీప్, స్టెప్స్​ ట్రాకింగ్,  కాల్,   ఎస్​ఎమ్​ఎస్,  ఈమెయిల్, వాట్సాప్​​ వంటివి చెక్​ చేసుకోవచ్చు. ఏడాది వారెంటీతో దాదాపు ఎనిమిది వందల రూపాయల నుంచే ఇవి ప్రారంభమవుతున్నాయి.

 

Latest Updates