ఫ్రీగా మాస్కులు పంచడమే అసలైన దేశభక్తి

న్యూఢిల్లీ: ప్రస్తుత తరుణంలో ఉచితంగా మాస్కులు పంచడాన్ని మించిన దేశభక్తి మరొకటి లేదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో మాస్కులు పెట్టుకోని వారి దగ్గరకు వెళ్లి ఫ్రీగా మాస్కులు పంపిణీ చేయాలని పార్టీ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కౌన్సిలర్లకు ఆయన పిలుపునిచ్చారు. ‘ఇప్పుడు మాస్కులు పంపిణీ చేయడమే అత్యుత్తమ దేశభక్తి, మానవసేవగా చెప్పొచ్చు. అన్ని రాజకీయ పార్టీలు, ఆయా పార్టీల వాలంటీర్లకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా.. మాస్కులు కట్టుకోని ప్రజల వద్దకు వెళ్లి మాస్కులను పంపిణీ చేయండి. తద్వారా అందరం కలసి కరోనా వ్యాప్తిని అడ్డుకుందాం’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.

Latest Updates