సందర్శకుల మనసు దోచుకుంటున్న సాగర తీరం

హైదరాబాద్ , వెలుగు : మహానగర అందానికి హుస్సేన్ సాగర్ అద్ధమైతే.. ఆ సాగర్ చుట్టూరా ఆహ్లాదభరితమైన గార్డెనింగ్ ఇప్పుడు మనసును దోచుకుంటోంది. నగరానికి విచ్చేస్తున్నదేశ, విదేశాల పర్యాటకులు హుస్సేన్‌‌‌‌సాగర్ అందాలను వీక్షించేందుకు ఇష్టపడుతుంటారు.దీంతో హుస్సేన్‌‌‌‌సా గర్లో బోటింగ్, సంజీవయ్య,లుంబినీ పార్కు , ఎన్టీఆర్ గార్డెన్‌‌‌‌ సందర్శకులతో కిక్కిరిసి పోతున్నాయి . ఇలా సాగరా తీరం నిత్యం సందర్శకులతో కళకళలాడుతుం టే.. సాగర్ చుట్టూరా పచ్చదనం ఆహ్లాదరకర వాతావరణాన్ని తలపిస్తోం ది. ఇందుకు హెచ్ ఎండీఏ సాగర తీరంలోని పార్కు లు, ఫుట్​పాత్ ల అభివృద్ధికి చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా పర్యాటకులను ఆకర్షించేందు కు విభిన్నరకాల మొక్కలనుపెంచింది.

రూ.వేలకోట్లతో గార్డెనింగ్..

హుస్సేన్ సా గర్ పరిసరాలలో గ్రీనరీ పెంచేందుకు హెచ్ ఎండీఏ కృషి చేస్తోంది. ఇందుకోసం బుద్ధ-ప్రాజెక్టు కిం ద రూ.వేల కోట్లను వెచ్చి పార్కుల అభివృద్ధితోపాటుగా సాగర్ చుట్టూ రకరకాలైన మొక్కలు పెంచుతోంది. హరితహారం స్ఫూర్తితో నెక్లెస్‌‌‌‌రోడ్‌‌‌‌లోని బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు కింద చేపట్టిన బతుకమ్మ పూలదోట కనువిందు చేస్తోంది.అలాగే నెక్లెస్ రోడ్ రైల్వేస్టేషన్ నుంచి సంజీవయ్య పార్కుకు వెళ్లేదారిలో ఎడమవైపు ప్రాంతంలో పచ్చదనం పెంచేందుకు అధికారులు నిర్ణయించారు. ఆ రైల్వేస్టేషన్ నుంచి సంజీవయ్య పార్కు కు సమీపంలోని నాలుగో రైల్వేబ్రిడ్జి వరకు సుమారు1.9 కిలోమీటర్ల మేర రోడ్డుకు ఎడమవైపున ఉన్నఖాళీ స్థలంలో అందమైన మొక్కలను పెంచుతున్నా రు.

సంజీవయ్య పార్కులో ..

సాగర్ ఒడ్డున సంజీవయ్య పార్కులో వివిధరకాలైన మొక్కలను పెంచేందుకు హెచ్ ఎండీఏచర్యలు తీసుకుంది. ప్రధానంగా ఈ పార్కు లో ఏర్పాటుచేసిన గులాబీ వనంలో 650 రకాలరోజా మొక్కలను సందర్శకులు తిలకించేందుకు ఉంచారు. గులాబీ తోటల సందర్శనకు రోజూ ఉదయం ఆరుగంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు అనుమతిస్తారు.

ఎన్ టీఆర్ గార్డెన్స్ ..

హైదరాబాద్‌ లో హుస్సే న్ సాగర్ సరస్సు పక్కన ఎన్టీఆర్ గార్డెన్స్ ఉంది. ఈ పార్కుకు సమీపంలోనే బిర్లా మందిర్, నెక్లెస్ రోడ్, లుంబినీ పార్క్ ఉండడంతో పర్యాటకులు ఎక్కువగా సందర్శిస్తుంటారు. బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు కింద ఈ పార్కును హెచ్ ఎండీఏ డెవలప్ చేసిం ది. సందర్శకులకు నగరం కనిపించేలా ఎత్తైన రొటేటర్‌‌‌‌ టవర్‌‌‌‌ ఈగార్డెన్‌‌‌‌లో ఏర్పాటు  చేశారు. అలాగే ఇందులో కూడా విభిన్న రకాల మొక్కలను నాటారు. నిత్యం పచ్చదనంతో ఉట్టిపడేలా పార్కును తీర్చి దిద్దా రు.లుం బినీపార్కు..పర్యాటకుల తాకిడి ఎక్కువ ఉండే లుంబినీ పార్కును హెచ్ఎండీఏ బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు కింద అన్ని రకాలుగా అభివృద్ధి చేసిం ది. సుమారుగా రూ. 2.35 కోట్ల అంచనా వ్యయంతో పార్కును డెవలప్ చేసింది. పర్యాటకులను ఆకర్షించేందుకు పార్కు లో మ్యూజిక్ ఫౌంటెన్, పూలతోటలు,బోటింగ్, లేజర్ షోలను ఏర్పాటు చేసింది. ప్రస్తుతానికి బోటింగ్ కు వచ్చే సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచేందుకు మొక్కలను నాటింది.

Latest Updates