పారిశుద్ధ్యంపై ప్రజలు దృష్టి పెట్టాలి : ఈటల

సూర్యాపేట : పారిశుద్ధ్యంపై ప్రజలు దృష్టి పెట్టాలన్నారు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్. మంగళవారం మంత్రులు ఎర్రబెల్లి, జగదీశ్ రెడ్డితో కలిసి సూర్యాపేట ఏరియా హాస్పిటల్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈటల. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..సూర్యాపేట మెడికల్ కాలేజీని… ఉస్మానియా తరహాలో డెవలప్ చేస్తామన్నారు.

రెండేళ్లలో కాలేజీకి పక్కా భవనం ఏర్పాటు చేస్తామన్నారు. వైద్యం అందుతున్న తీరుపై డాక్టర్లను ఆరా తీసిన మంత్రులు.. హస్పిటల్ లో చిన్నారులకు రోటా టీకాలు వేశారు. అనంతరం మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ తో మాట్లాడి సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు మంత్రులు.

Latest Updates