సమ్మర్ లో కాటన్ బట్టలు బెటర్

ఎప్పుడూ ఒకే తరహా దుస్తులు బాగుండవు. కాలానికి అనుగుణంగా మన ఫ్యాషన్ ట్రెండ్ లో మార్పులు తెచ్చుకోవాల్సిందే. అందుకే వేసవికాలం దుస్తుల ఎంపికలో ఇంకాస్త ఎక్కువ శ్రద్ధ చూపెడతారు అమ్మాయిలు. వేసవి వేడిని తట్టు కుని శరీరానికి చల్లదనాన్నిచ్చే కాటన్ వస్ర్తాలని ఈ కాలం ప్రత్యేకంగా ఎంచుకుంటారు. అందులోనూ ఖాదీ కాటన్ ఒంటికి అందించే చల్లదనం మనసునీ తాకుతుంది. ముఖ్యంగా పొద్దునూరు కాటన్ ధరిస్తే కలిగే సౌకర్యమే వేరు. కాస్త ఖరీదెక్కువైనా .. అందానికి ఖద్దరుకు మించింది లేదంటారు చాలామంది . అంతేనా బెంగాల్, బాంది నీ రకాల దుస్తులు హుందాగా ఉంటాయి. ఇక వేసవిలో వేడుకలు ఎక్కువగానే ఉంటాయి . అలాంటి సమయంలో కర్షణీయమైన పీచ్ , లేత గులాబి, పౌడర్ బ్లూ , పిస్తా గ్రీన్ లాంటి కలర్స్​  వేసవిలో కనువిందు చేస్తాయి.

Latest Updates