ATMలో స్కిమ్మర్లతో జాగ్రత్త : సైబరాబాద్ DCP వార్నింగ్

బ్యాంకు ఖాతాల నుంచి నగదును దొంగిలించడానికి సైబర్ నేరగాళ్లు కొత్త దారులు వెతుకుతున్నారు. టెక్నాలజీని ఆధారంగా చేసుకుని… బ్యాంక్ లను బురిడీ కొట్టిస్తున్నారు. ఖాతాదారుల కష్టార్జితాన్ని కొల్లగొడుతున్నారు. అకౌంట్ హోల్డర్లకు తెలియకుండా ఏటీఎంలను “స్కిమ్మింగ్” చేసి నేరగాళ్లు డబ్బు స్వాహా చేస్తున్నారు.ఇలాంటి నేరాలపై జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు సైబరాబాద్ డీసీపీ క్రైమ్స్ రోహిణీ ప్రియదర్శిని.

స్కిమ్మింగ్ అంటే ఏంటి?

జనరల్ గా ఏటీఎం మెషీన్ లలో డెబిట్, క్రెడిట్ కార్డులు ఇన్ సర్ట్ చేసి నగదు లావాదేవీలు చేస్తుంటారు ఖాతాదారులు. ఐతే… ఈ డెబిట్, క్రెడిట్ కార్డుల స్వైప్ చేసేటప్పుడు వినియోగదారులు ఇచ్చే ఇన్ పుట్ ఏటీఎం మెషీన్ కు మాత్రమే తెలుస్తుంటుంది. ఈ డేటాను ఎంటర్ చేసేటప్పుడు.. ఆ డేటాను రికార్డ్ చేసేలా… ఏటీఎం మెషీన్ కు కొన్ని ప్రత్యేకమైన పరికరాలను అమర్చుతున్నారు సైబర్ దొంగలు. అలా ప్రత్యేక పరికరాలను అమర్చి క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల సమాచారాన్ని దొంగతనంగా కాజేయడమే స్కిమ్మింగ్.

సైబర్ దొంగలు ముందుగానే కొన్ని ఏటీఎంలను సెలెక్ట్ చేసుకుని.. వాటికి ఈ స్కిమ్మింగ్ పరికరాలను అమరుస్తారు. ఏటీఎం పిన్ తెలుసుకోడానికి కీప్యాడ్‌‌కు పైభాగంలో చిన్న కెమెరాను, స్కానర్‌ను ఉంచుతారు. కస్టమర్లు ఏటీఎంలో కార్డును స్వైప్‌ చేసినప్పుడు, కార్డు మ్యాగ్నటిక్‌ స్ట్రిప్‌లోని సమాచారం, పిన్ నంబర్ లను స్కిమ్మర్‌ రికార్డ్ చేస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ ను ఉపయోగించి… ఏటీఎంనుంచి… మనీ డ్రా చేస్తారు ఏటీఎం దొంగలు.

ఈ జాగ్రత్తలు మస్ట్

  • ఏటీఎంలకి వెళ్లినప్పుడు స్కిమ్మర్లు లాంటి అనుమానాస్పద పరికరాలు ఏవైనా పెట్టారా అనేద గమనించాలి.
  • చేతులు అడ్డుపెట్టి పిన్ నంబర్ ఎంటర్ చేయాలి
  • జనం ఎక్కువగా లేని ఏటీఎంల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి
  • నగదు విత్‌డ్రా చేయగానే మొబైల్‌‌కు మెసేజ్‌లు వచ్చేలా SMS అలర్ట్‌లు పెట్టుకోవాలి.
  • అనుమానాస్పద లావాదేవీ జరిగితే వెంటనే సైబర్ క్రైమ్ లో కంప్లయింట్ ఇవ్వాలి

Latest Updates