బెజోస్ ఇల్లు.. 1,176 కోట్లు

ప్రియురాలి కోసం కొన్న ప్రపంచ కుబేరుడు

అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ తన ప్రియురాలు లారెన్ సాంచెజ్ కు ఓ ఖరీదైన గిఫ్ట్ ఇచ్చారు. ఆమె కోసం రూ.1,176 కోట్ల ఇంద్ర భవనాన్ని కొనుగోలు చేశారు. లాస్ ఏంజిలిస్ లోని బివర్లీహిల్స్ లో 9 ఎకరాల స్థలంలో ఉన్న వార్నర్ ఎస్టేట్ ను ఆయన ఈ రికార్డు ధర పెట్టి సొంతం చేసుకున్నారు. కాలిఫోర్నియా లో ఇదే అతిపెద్ద డీల్ అని స్థానిక మీడియా పేర్కొంది. 13,600 చదరపుటడుగులున్న ఈ భవనంలో గెస్ట్ హౌస్, టెన్నిస్ కోర్టు, గోల్ఫ్ కోర్స్ ఉన్నాయి. బెజోస్ ఈ ఇంటిని మీడియా మొఘల్, తన ఫ్రెండ్ డేవిడ్ గెఫెన్‌ నుంచి కొనుగోలు చేశారు. గెఫెన్ ఈ ఇంటిని 1990లో 338 కోట్లకు కొన్నారు. బెజోస్ బివర్లీహిల్స్ లోనే మరో ఖరీదైన ఎస్టేట్ ను రూ.641 కోట్లకు సొంతం చేసుకున్నారు.

Latest Updates