ఆటో డ్రైవర్‌ మంచితనం

భద్రాచలం, వెలుగు : తన ఆటోలో నగలు పోగొట్టుకున్న మహిళ సంచిని పోలీసులకు అప్పగించి ఓ ఆటో డ్రైవర్‌ తననిజాయితీని చాటుకున్నారు. ఈ ఘటన శుక్రవారం బూర్గం పాడు మండలం సారపాకలో జరిగింది. బూర్గంపాడు నుంచి దుమ్ము గూడెం వెళ్తున్న గణేశ్‌ అనే ఆటో డ్రైవర్‌ బూర్గం పాడు మండలం నాగినేనిప్రోలు రెడ్ డిపాలెం వద్ద ఓ యువతిని ఎక్కిం చుకున్నా డు. సారపాకలో ఆమె తన బ్యాగును మరిచి దిగిపోయింది. కొద్దిసేపటికే ఆమె తన నగల సంచి కన్పించడం లేదంటూ అక్కడే కూలబడింది. భద్రాచలం దాటాక ఆటో డ్రైవర్‌ గణేశ్‌ సంచిని గమనించి, చూడగా అందులో నగలు ఉన్నాయి.

వెంటనే ఆటోతో సహా వెళ్లి బూర్గంపాడు ఎస్సైకి నగల సంచిని అందించి , వివరాలు వెల్లడించాడు. రెడ్డిపాలెంలో మహిళ ఎక్కిందని, ఆమెదే అయి ఉండొచ్చని పోలీసులతో చెప్పాడు.  సారపాకలో మహిళ సంచి పోగొట్టుకున్న విషయాన్ని తెల్సుకున్న ఎస్సై.. ఆమెను పిలిపించి, విచారించి, నగల సంచిని అప్పగిం చారు. నిజాయితీగా సంచిని తెచ్చి ఇచ్చిన ఆటో డ్రైవర్ గణేశ్‌ను మెచ్చు కుని, బూర్గం పాడు ఎస్సై వెంకటప్పయ్య రూ.500 నగదు బహుమతి అందజేశారు. సంచిలో ఉన్న నగల విలువ రూ.1.50లక్షలు ఉంటుందని తెలిపారు పోలీసులు.

Latest Updates