శ్రీరామనవమి తేదీని ప్రకటించిన భద్రాచలం దేవస్థానం

భద్రాచలం, వెలుగు: మార్చి 25 నుంచి ఏప్రిల్‍8 వరకు శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం వైదిక కమిటీ ప్రకటించింది. ఈ మేరకు షెడ్యూల్‍ వెల్లడించింది. దేశవ్యాప్తంగా శ్రీరామనవమి తేదీకి భద్రాచలం ముహూర్తమే కొలమానం. అందుకే ఈ షెడ్యూల్‍ కోసం దేవస్థానాలు ఎదురు చూస్తుంటాయి.

ఏప్రిల్‍2న శ్రీరామనవమి సీతారాముల కల్యాణం, 3న మహాపట్టాభిషేకం నిర్వహించనున్నారు.  ఈ మేరకు వైదిక కమిటీ ఉత్సవ వివరాలను శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం ఈవో గదరాజుకు సమర్పించారు.  ఈ షెడ్యూల్‍ను ఎండోమెంట్‍ కమిషనర్ ద్వారా ప్రభుత్వానికి అందజేయనున్నారు.

see also: కమలం గ్రాఫ్​ పెరిగింది

see also: పాల సేకరణ ధర రూ.2 పెరిగింది

see also: ఈరోజే చైర్‌‌ పర్సన్లు, మేయర్ల ఎన్నిక

see also: ‘హంగ్​’లలో ఎక్కువ టీఆర్​ఎస్​ చేతికి?

Latest Updates