కారును ఢీకొన్న లారీ.. ముగ్గురు మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెంచుపల్లి మండలం పెనగడపల వద్ద కారును టిప్పర్‌ లారీ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డవారిని కొత్తగూడెం ఏరియా హస్పిటల్ కి తరలించి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు  తెలిపారు డాక్టర్లు. మృతులు కొత్తగూడెంనకు చెందిన రమేశ్‌ (41), సుజాత(39), ప్రశాంతి(31)గా గుర్తించారు. వీరంతా విజయవాడలో చదువుతున్న తమ కుమార్తెను చూసి.. తిరుగు ప్రయాణంలో పెనగడపల వద్దకు రాగానే ఈ ప్రమాదం జరిగింది.

Latest Updates