పార్టీ విరాళాల కోసం జెర్సీల వేలం

భారత ఫుట్‌బాల్‌ జట్టు మాజీ కెప్టెన్‌ బైచుంగ్‌ భూటియా రిటైర్‌ అయిన తర్వాత రాజకీయాల్లో ప్రవేశించి హమ్‌రో సిక్కిం పార్టీ(HSP) పేరుతో సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఈ పార్టీ తొలిసారిగా బరిలోకి దిగుతుంది. అయితే ఐతే ఎన్నికల ఖర్చు కోసం విరాళాలు సేకరించేందుకు భూటియా తన జెర్సీలను అమ్మకానికి పెట్టారు. తనకెంతో ఇష్టమైన రెండు జెర్సీలను ఆన్‌లైన్‌ ద్వారా వేలానికి ఉంచారు. ఇందులో 2012లో తన వీడ్కోలు మ్యాచ్‌లో ధరించిన జెర్సీ కూడా ఉంది. 2014లోక్‌సభ ఎన్నికల్లో, 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్‌ తరఫున పోటీ చేసి భూటియా ఓడిపోయారు. గతేడాది మార్చిలో హమ్‌రో సిక్కిం పార్టీ పేరుతో సొంత రాజకీయ పార్టీని ప్రారంభించారు.

 

Latest Updates