ముక్కు ద్వారా ఒక్క డోసులో కరోనా వ్యాక్సిన్: భారత్ బయోటెక్

కరోనా వ్యాక్సిన్ కొవాగ్జిన్… భారత్ లో అత్యవసర వినియోగానికి అనుమతులు పొందింది. మరికొన్నిరోజుల్లోనే ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ క్రమంలో కొవాగ్జిన్ సృష్టికర్త భారత్ బయోటెక్ మరో వ్యాక్సిన్ తీసుకువచ్చేందుకు సిద్ధమైంది. ఈసారి తీసుకువచ్చే టీకా ముక్కు ద్వారా తీసుకోగలిగే వీలుంటుందని భారత్ బయోటెక్ తెలిపింది. ఇది ఒక్క డోసు తీసుకుంటే సరిపోతుందని చెప్పింది. ఇప్పుడున్న కరోనా వ్యాక్సిన్లన్నీ రెండు డోసుల వ్యాక్సిన్లే.

కొవాగ్జిన్ వ్యాక్సిన్ ను ICMR సహకారంతో అభివృద్ధి చేసిన భారత్ బయోటెక్… ముక్కు ద్వారా తీసుకునే వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసేందుకు వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ తో కలవనుంది. ఈ ముక్కులో వేసే కరోనా వ్యాక్సిన్ కు BBV154 అని నామకరణం చేసింది. ఈ వ్యాక్సిన్ కు సంబంధించి భారత్, అమెరికాలో నిర్వహించిన ప్రీ క్లినికల్ ప్రయోగాలు సఫలం అయ్యాయని భారత్ బయోటెక్ తెలిపింది.

Latest Updates