నిమ్స్ లో భార‌త్ బ‌యో టెక్ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ ప్రారంభం

హైద‌రాబాద్ : భారత్ బయో టెక్ వారి క్లినికల్ ట్రయల్స్ కి నిమ్స్ లో మంగ‌ళ‌వారం నుంచి ఆరోగ్య వతమైన వ్యక్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఆరోగ్యంగా ఉండి క్లినికల్ ట్రయల్ కి సమ్మతించిన‌ వారి రక్త నమూనాలను, సేకరించి వివిధ రకాల వైద్య పరీక్షలు చేయనుంది నిమ్స్ హాస్పిట‌ల్. అన్ని బాగున్న వారికి మొదటి డోస్ ఇచ్చే అవకాశం ఉంది. డోస్ ఇచ్చిన తర్వాత 2 రోజుల పాటు హాస్పిట‌ల్ లో ఉంచి ఆరోగ్య పరిస్థితిపై సమీక్ష చేయ‌నున్న‌ట్లు డాక్ట‌ర్లు చెప్పిన‌ట్లు స‌మాచారం. 14 రోజుల తర్వాత మరో డోస్ ఒక్కో వ్యక్తికి 3 డోస్ లు ఇచ్చి, ట్రయల్ చేయనున్నారట‌ నిమ్స్ డాక్ట‌ర్లు.

Latest Updates