కన్నుల పండుగగా భారతమాతకు మహాహారతి కార్యక్రమం

హైద్రాబాద్ నెక్లెస్ రోడ్ లో భారతమాతకు మహాహారతి కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ తమిళిసై, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. గణతంత్ర దినోత్సవం రోజు భారతమాతకు హారతివ్వటం సంతోషంగా ఉందన్నారు గవర్నర్. భారతీయ సంస్కృతీ, సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కార్యక్రమం నిర్వహిస్తోన్న కిషన్ రెడ్డికి గవర్నర్ అభినందనలు తెలిపారు. యువత జాతీయ భావం పెంపొందించుకోవాలని చెప్పారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. కార్యక్రమంలో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. 3 వేల మంది విద్యార్థులకు పైగా భారతమాత వేషధారణలో కార్యక్రమానికి హాజరయ్యారు.