భారతీసింగ్‌ కొత్త‌‌‌ షో ‘ఫన్‌ హిట్‌‌‌‌‌‌‌ మే జారీ’

‘ద కపిల్‌ శర్మ షో’ , ‘కామెడీ సర్కస్‌‌‌‌’ వంటి షోస్‌‌‌‌తోపాటు పలు టీవీ షోస్‌‌‌ ‌ద్వారా పేరు తెచ్చుకున్న కమెడియన్‌ భారతీ సింగ్‌‌‌‌. డ్యాన్స్‌, ఇతర రియాలిటీ షోస్‌‌‌‌లో కూడా పాల్గొంది. ఇంతవరకు వేరే షోస్‌‌‌‌లో పార్టిసిపేట్‌ చేసిన భారతీ సింగ్‌‌‌‌ ఇప్పుడు సొంతంగా ఒక షో చేయనుంది. ‘ఫన్‌ హిట్‌ మే జారి’ పేరుతో ఒక కామెడీ షో స్టార్ట్‌‌‌‌ చేయబోతోంది. భర్త హర్ష్‌లింభాచియాతో కలిసి ఈ షో చేస్తుంది. ‘సబ్‌ టీవీ’లో మొదలుకానున్న ఈ షోలో కృష్ణా అభిషేక్‌, శర్మాన్‌ జైన్‌, ముబీన్‌ సౌదాగర్‌, జాస్మిన్‌ భేసిన్‌ వంటి సెలబ్రిటీలు పార్టిసిపేట్‌ చేయనున్నారు. ఇది కూడా ‘ద కపిల్‌ శర్మ షో’లా సాగే కామెడీ షో. వారానికో కాన్సెప్ట్‌‌‌తో స్కిట్స్‌ చేసి ఎంటర్‌టైన్‌ చేస్తారు. ఈమధ్యే షూటింగ్‌‌‌‌ మొదలైంది. త్వరలోనే షో టెలికాస్ట్‌‌‌‌ అవుతుందని యూనిట్‌ చెప్పింది. ప్రస్తుతం కొత్త షో చేస్తున్న నేపథ్యంలో భారతీ సింగ్ మిగతా టీవీ షోస్‌‌‌‌ చేస్తుందో లేదో తెలియాలి.

Latest Updates