రూ.10వేల కోట్లను చెల్లించిన ఎయిర్‌టెల్‌

సుప్రీంకోర్టు తీర్పుతో టెలికాంశాఖకు 10వేల కోట్ల రూపాయలను చెల్లించింది భారతి ఎయిర్ టెల్. ఈ విషయాన్ని సంస్థ ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు. సుప్రీంకోర్టు తదుపరి విచారణ గడువులోగా మిగితా మొత్తాన్ని చెల్లిస్తామని చెప్పారు. ‘అడ్జెస్ట్ గ్రాస్ రెవెన్యూ’ బకాయిల చెల్లింపుల విషయంలో కోర్టు ధిక్కరణకు పాల్పండారంటూ ఎయిర్ టెల్, వోడాఫోన్, ఐడియా సంస్థలపై ఇటీవల సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసి.. 1.47లక్షల కోట్లను చెల్లించమని ఆదేశాలు జారీచేసింది. న్యాయస్థానం ఆదేశాలను పట్టించుకోకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది కోర్టు. దీంతో పాటు టెలికాం సంస్థలపై ఎటువంటి చర్యలు తీసుకోరాదని టెలికాం విభాగంలోని ఓ ఆఫీసర్ ఆదేశాలు ఇవ్వడంపైనా సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. దీంతో టెలికాం విభాగంలోని ఓ అధికారి ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవడంతో పాటు తక్షణమే బకాయిలు చెల్లించాలని సదరు కంపెనీలను ఆదేశించింది. దీంతో ఎయిర్ టెల్ 10వేల కోట్ల రూపాయలను సోమవారం చెల్లించింది. మరో 35వేల కోట్లను చెల్లించాల్సి ఉంది.

Latest Updates