స్వార్థంతోనే కేసీఆర్ ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతి

హైదరాబాద్: ప్రజలంతా కరోనా ఇబ్బందుల్లో ఉంటే కేసీఆర్ మాత్రం సందట్లో సడెమియాలా వ్యవహరిస్తున్నారన్నారు సీఎల్పీ నేత  భట్టి విక్రమార్క. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ లో మాట్లాడిన ఆయన.. స్వార్థంతోనే సీఎం కేసీఆర్ ఐదు ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతి ఇచ్చారన్నారు. అవన్నీ అతనికి ఆర్థిక వనరులు సమకూర్చే వారికే ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వ యూనివర్సిటీల స్టాఫ్ ని, నిధులని కేటాయించకుండా నిర్వీర్యం చేస్తున్నారని.. ఉన్నత విద్యను బజారులో పెట్టి అమ్ముతున్నారని మండిపడ్డారు. మంత్రి మాల్లారెడ్డికి, పల్లా రాజేశ్వర్ రెడ్డికి యూనివర్సిటీలు ఇవ్వడం అధికార దుర్వినియోగమే అని తెలిపారు.

ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి జిల్లాకు యూనివర్సిటీ కేటాయించి.. ఉన్నత విద్యను ప్రోత్సహించామని చెప్పారు. పేద విద్యార్థులు చదువుకోవడం కేసీఆర్ కు ఇష్టం లేదన్న భట్టి.. ప్రైవేట్ యూనివర్సిటీల వల్ల ఎస్సి, ఎస్టీ విద్యార్థులు నష్టపోతారన్నారు. ఉన్న యూనివర్సిటీలను అప్ గ్రేడ్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఉద్యోగావకాశాలు కల్పించే కోర్సులను ప్రవేశ పెట్టాలన్నారు.  ఎస్సి,ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలకు ఉన్నత విద్య అందుబాటులో లేకుండా పోతుందని.. బాంచెన్ దొర సంస్కృతికి తెరలేపడానికే కేసీఆర్ ప్రైవేట్ యూనివర్సిటీలను తెస్తున్నారని తెలిపారు భట్టి విక్రమార్క.

Latest Updates