ధరణి వెబ్‌సైట్‌లో అన్నీ లోపాలే..!

హైదరాబాద్‌: ధరణి వెబ్ సైట్ లో అన్నీ లోపాలే ఉన్నాయన్నారు కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క. నూతన రెవెన్యూ చట్టంపై శుక్రవారం అసెంబ్లీలో చర్చ సందర్భంగా మాట్లాడిన భట్టి విక్రమార్క.. ధరణి వెబ్‌సైట్‌లో లోపాలు ఉన్నాయని తెలిపారు. అసైన్డ్‌ భూముల ఎంట్రీ సమస్యలను ఎప్పుడు పరిష్కరిస్తారని ప్రశ్నించారు. సమగ్ర భూ సర్వే చేయకపోతే సమస్యలు అలాగే ఉంటాయన్నారు. భూ సర్వే ఎప్పుడు చేపడతారో స్పష్టత ఇవ్వాలన్నారు. సర్వర్‌ ఎవరైనా హ్యాక్‌ చేసి రికార్డ్స్‌ మార్చితే ఎలా? మాన్యువల్‌ రికార్డులు కూడా ఉండేట్టు చూడాలని ప్రభుత్వానికి సూచించారు కాంగ్రెస్ శాసన సభాపక్ష నేత మల్లు భట్టివిక్రమార్క.

Latest Updates