వ్యవసాయాన్నికార్పొరేట్లకు అప్పగించే కుట్ర

వ్యవసాయాన్ని కార్పొరేట్లకు అప్పగించేందుకే కేంద్రం కొత్త వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చిందన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. కేసీఆర్ తన స్వార్థం కోసం రైతుల సమస్యల్ని మోడీ దగ్గర తాకట్టుపెట్టారని విమర్శించారు. కొనుగోలు కేంద్రాలు ఎత్తివేస్తే ఊరుకోమన్నారు కాంగ్రెస్ లీడర్లు. రైతుల సమస్యలను కేంద్రం పట్టించుకోవాలన్నారు.  రైతు సమస్యలపై గాంధీ భవన్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహంచింది కాంగ్రెస్. అగ్రిచట్టాలు, రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలు ఎత్తివేయడం, రైతురుణ మాఫీ వంటి అంశాలపై చర్చించారు నేతలు. అగ్రిచట్టాలను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ లీడర్లు.

గవర్నర్ ను తొలగించాలని రోడ్డెక్కిన సీఎం

Latest Updates