లంచం తీసుకున్నRI వెక్కి వెక్కి ఏడ్చింది

ఓ వైపు దాడులు జరుగుతున్నా…మరోవైపు రెవెన్యూ అధికారుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. ఏ పనికావాలన్నా లంచం ఇవ్వాల్సిందేనంటున్నారు. ఇందులో భాగంగానే డెత్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు ఓ రెవెన్యూ అధికారిణి లంచం డిమాండ్ చేసింది. చివరకు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడింది.

పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు గ్రామానికి చెందిన చొప్పిశెట్టి సత్యనారాయణ అనే వ్యక్తి కొద్ది రోజుల క్రితం చనిపోయాడు. ఆ తర్వాత ఆయన కుమారుడు, కుమార్తె కూడా చనిపోయారు. వీరి తరఫున ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కావాలంటూ మృతుని భార్య బేబీ, మీ సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోగా, ఆ పేపర్లు ఆర్ఐ సౌజన్యా రాణి కార్యాలయానికి చేరాయి. అయితే సర్టిఫికెట్ ఇచ్చేందుకు ఆమె లంచం అడిగింది.

దీంతో రూ. 3 వేలకు డీల్ కుదుర్చుకున్న బాధితురాలు బేబీ.. ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. ఈ క్రమంలోనే ప్లాన్ చేసిన ఏసీబీ అధికారులు, బేబీ నుంచి సౌజన్యా రాణి డబ్బు తీసుకుంటుండగా, పట్టుకున్నారు. ఆపై సొమ్మును స్వాధీనం చేసుకుని కేసు పెట్టారు. పట్టుబడిన తర్వాత ఏసీబీ అధికారులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సౌజన్యా రాణి వెక్కివెక్కి ఏడ్చారు తప్ప సమాధానం మాత్రం చెప్పలేదు.

Latest Updates