మంచి మనసు చాటుకున్న భువనగిరి ఎమ్మెల్యే

యాదాద్రి భువనగిరి: భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి మంచి మనసు చాటుకున్నారు. శనివారం భువనగిరి బైపాస్ రామకృష్ణాపురం చౌరస్తా దగ్గర బైకు లారీ ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. అంబులెన్స్ కు కాల్ చేయించి గాయపడ్డవారిని దగ్గరుండి హస్పిటల్ కి తరలించారు.

క్షతగాత్రులకు మెరుగైన ట్రీట్ మెంట్ అందించాలని డాక్టర్ కి కాల్ చేసి తెలిపారు.  ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు ఫోన్ చేసి తెలియజేయాలని 108 సిబ్బందికి తెలియజేశారు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు  నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గాయపడ్డ వారి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు.

Latest Updates