దిగ్విజయ్ రోడ్ షో: కాషాయ కండువాలతో పోలీసులు

భోపాల్ పోలీసులు డ్రెస్ కోడ్ చర్చనీయాంశంగా మారింది. భోపాల్ లో కాంగ్రెస్ అభ్యర్థి దిగ్విజయ్ సింగ్ ప్రచారంలో భాగంగా పోలీసులు… సివిల్ డ్రెస్ లో కాషాయ కండువాలు కప్పుకుని విధులు చేపట్టడం  హాట్ టాపిక్ గా మారింది. కంప్యూటర్ బాబాతో కలిసి దిగ్విజయ్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు కాషాయ కండువాలు, షర్ట్ లు వేసుకున్నారు.. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశంతోనే తాము ఈ కండువాలు వేసుకున్నామని, తమను ఇలాగే విధుల్లోకి వెళ్లాలని చెప్పినట్లు కానిస్టేబుళ్లు చెప్పారు. ఇవాళే బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, భోపాల్ అభ్యర్థి సాద్వి ప్రగ్యాసింగ్ తో కలిసి భోపాల్ లో రోడ్ షోలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఈ పరిణామం రాజకీయంగా అలజడి సృష్టిస్తోంది.

Latest Updates