జైల్ నుంచి రిలీజైన అఖిలప్రియ.. నేరుగా ఫిల్మ్ నగర్ టెంపుల్ కి

బోయిన్ పల్లి  కిడ్నాప్ కేసులో అరెస్టై జైళ్లో ఉన్న మాజీ మంత్రి అఖిలప్రియ విడుదలయ్యారు. కోర్టు నుంచి అర్డర్ కాపీ తీసుకున్న జైలు అధికారులు ఆమెను విడుదల చేశారు. జైల్ నుంచి నేరుగా ఫిల్మ్ నగర్ దేవాలయానికి వెళ్లారు  అఖిల ప్రియ.  వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత అక్కడి నుంచి జూబ్లీహిల్స్ లోని తన పిన్ని ఇంటికి వెళ్లారు అఖిల ప్రియ.

హాఫీజ్ పేట్ భూ వివాదంలో బోయిన్ పల్లికి చెందిన ప్రవీణ్ రావు ఆయన సోదరుల కిడ్నాప్ కేసులో అఖిల ప్రియ అరెస్ట్ అయ్యారు. దాదాపు 18 రోజులు ఆమె జైల్లో ఉన్నారు. చాలా సార్లు బెయిల్ కోసం ట్రై చేసినప్పటికి కోర్టు బెయిల్ నిరాకరించింది. శుక్రవారం సెషన్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది.ఇంకా ఈ కేసులో ఇప్పటికే 19మందిని అరెస్ట్ చేశారు పోలీసులు.

see more news

రామమందిర నిర్మాణానికి నేతల విరాళాలు..ఎవరెవరు ఎంతంటే?

మంత్రుల ముందే సర్పంచ్ ల నిరసన.. ఎర్రబెల్లి అసహనం

పిలిచి అవమానిస్తారా?. మోడీ ముందే మమత ఆగ్రహం

ప్రియురాలి మరణం తట్టుకోలేక ప్రియుడు ఆత్మహత్య

Latest Updates