హఫీజ్‌‌‌‌పేట్‌‌‌‌లో అడ్డా వేసిన భూమా ఫ్యామిలీ

హఫీజ్‌‌‌‌పేట్‌‌‌‌ భూముల వెనుక పెద్దలు!

సర్కారుకు సన్నిహితమైన కంపెనీకి అక్కడ ఆస్తులు

ఉమ్మడి ఏపీ టైంలోనే అడ్డా వేసిన భూమా ఫ్యామిలీ

సర్కారు పెద్దలకు దగ్గరివాళ్లు కావడంతో స్పెషల్​ ఫోకస్

హైదరాబాద్, వెలుగు: హఫీజ్‌‌‌‌పేటలోని 50 ఎకరాల భూవివాదమే ప్రవీణ్‌‌‌‌రావు, సునీల్‌‌‌‌, నవీన్‌‌‌‌ల కిడ్నాప్‌‌‌‌కి కారణమని పోలీసులు చెప్తున్నారు. ఈ విషయంలో ఇరువైపులా ఉన్నవాళ్లంతా హైప్రొఫైల్​ వ్యక్తులే. మియాపూర్‌‌‌‌‌‌‌‌లో జరిగిన భూకబ్జాల్లో భాగంగానే సర్వే నంబర్‌‌‌‌ 80లోని కాందీశీకులకు చెందిన 40 ఎకరాలను భూమానాగిరెడ్డి గతంలో జీపీఏ చేసుకున్నట్టు సమాచారం. ఇదే ప్రాంతంలో ప్రస్తుత సర్కారు పెద్దలకు అత్యంత దగ్గరి సంస్థకు చెందిన క్రషర్స్‌‌‌‌, వెంచర్స్‌‌‌‌, 120 అడుగుల రోడ్డు ఉన్నట్టు తెలిసింది. ఈ క్రమంలోనే ప్రవీణ్‌‌‌‌రావు ఫ్యామిలీకి, భూమానాగిరెడ్డికి మధ్య వివాదాలు తలెత్తాయి. సుప్రీంకోర్టు విచారణలో కూడా ప్రవీణ్‌‌‌‌ ఫ్యామిలీకి అనుకూలంగా తీర్పు వచ్చినట్టు తెలిసింది. ఈ క్రమంలో చాలాసార్లు కూర్చుని మాట్లాడుకున్న తర్వాత ఏవీ సుబ్బారెడ్డి మీడియేటర్‌‌‌‌‌‌‌‌ గా భూమానాగిరెడ్డి, ప్రవీణ్‌‌‌‌రావు సెటిల్‌‌‌‌మెంట్‌‌‌‌ చేసుకున్నారు. అయితే 2016 నుంచి ప్రవీణ్‌‌‌‌రావు, అఖిలప్రియ మధ్య మళ్లీ వివాదం మొదలైంది. నాగిరెడ్డి చనిపోయిన తర్వాత అఖిలప్రియ భర్త భార్గవరామ్​ఈ ల్యాండ్‌‌‌‌ ఇష్యూలో ఎంటరైనట్టు సమాచారం.

మంత్రి, ఎంపీ కలుగజేసుకుని..

హఫీజ్​పేట ల్యాండ్​లో తమకు వాటా ఇవ్వాలని ప్రవీణ్​రావును అఖిలప్రియ, ఆమె భర్త భార్గవరామ్​డిమాండ్​ చేసినట్టు తెలిసింది. దీంతో ప్రవీణ్​తమకు అనుకూలంగా ఉన్న డాక్యుమెంట్స్‌‌‌‌ను రెండేండ్ల క్రితమే చూపించాడని.. అయినా వారు ప్రవీణ్​రావును బెదిరిస్తూనే వచ్చారని సమాచారం. అందులో భాగంగానే ప్లాన్‌‌‌‌ ప్రకారం ప్రవీణ్‌‌‌‌రావు, సునీల్‌‌‌‌, నవీన్‌‌‌‌ ను కిడ్నాప్‌‌‌‌ చేయించారని అంటున్నారు. అయితే ప్రవీణ్‌‌‌‌రావు సీఎం కేసీఆర్‌‌‌‌ కు బంధువు కావడంతో.. మంత్రి శ్రీనివాస్‌‌‌‌ గౌడ్‌‌‌‌, పోలీస్‌‌‌‌ అధికారులు ఈ కేసుపై స్పెషల్‌‌‌‌ ఫోకస్‌‌‌‌ పెట్టినట్టు తెలిసింది. హఫీజ్‌‌‌‌పేటలోని వివాదాస్పద ల్యాండ్స్‌‌‌‌లో ఓ మహిళా ఎంపీకి కూడా వాటా ఉన్నట్టు సమాచారం. ప్రవీణ్‌‌‌‌రావు ఇంట్లో ఐటీ రైడ్స్‌‌‌‌ జరుగుతున్నాయనే సమాచారంతో మంగళవారం రాత్రే ఆ మహిళా ఎంపీ పోలీసులకు కాల్‌‌‌‌ చేసి ఆరా తీసినట్టు తెలిసింది.

For More News..

ఆరేండ్లలో 630 జూనియర్ కాలేజీలు క్లోజ్

రూ.50 లక్షల లోపు ఇండ్లకు ఫుల్ డిమాండ్

సాగర్‌లో పోటీ చేసేది నేనే.. నా కొడుకు కాదు

Latest Updates