పాకిస్థాన్ లో ఉంటున్నామా.. హైదరాబాద్ లో ఉంటున్నామా

హైదరాబాద్: అఖిల ప్రియ అక్కకు ఫుడ్ పెట్టకుండా నానా కష్టాలు పెడుతున్నారన్నారు భూమా మౌనిక. అఖిల అక్కకు తీవ్ర జ్వరం ఉందని.. హెల్త్ కండీషన్ ఒకలా ఉంటే.. పోలీసులు స్టేట్ మెంట్ ఒకలా ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత అన్యాయం జరుగుతుంటే ఒక సినిమా చూసినట్లు చూడాలా అని ప్రశ్నించారు. ఈ కేసుపై కూర్చుని మాట్లాడుకుందామన్న మౌనిక.. దయచేసి సీఎం కేసీఆర్ గారు దీనిపై హెల్ప్ చేయాలన్నారు. మా అడ్వకేట్ అక్క దగ్గరకు వెళ్లే సరికి కళ్లు తిరిగి కింద పడిపోయి, డీ హైడ్రేషన్ .. ముక్కు నుండి రక్తం కారుతుందట.. చనిపోతుంటే చూస్తూ కూర్చోవాలా  ఏదైనా ఉంటే కోర్ట్ చూసుకుంటుందని.. పోలీసులు ఎందుకు ఇన్వాల్ అవుతున్నారో అర్ధం కావడంలేదన్నారు.

రెండు ప్రభుత్వాల నుంచి ఒత్తడి చేస్తున్నారని.. దయచేసి కూర్చుని మాట్లాడుకుందామని వేడుకుంటున్నామన్నారు. సీఎం బంధువులమన్నప్పుడు కేసీఆర్ గారు, కేటీఆర్, కవిత ఎవరైనా మాపై దయతలచాలన్నారు. ఈ రాజకీయ కుళ్లు కుతంత్రాలు మాకు వద్దన్న ఆమె… రాత్రికి రాత్రే ఏం ఢీల్ జరిగిందో అర్ధం కావడంలేదని.. A2 నుండి A1గా అఖిల ప్రియను ఎలా మారుస్తారన్నారు. సెటిలర్లను పట్టించుకోరా అన్న ఆమె.. మేం కూడా హైదరాబాద్ లోనే ఉన్నామని.. ఓట్లు కూడా వేశామన్నారు. ఈ పరిస్థితి చూస్తుంటే పాకిస్థాన్ లో ఉంటున్నామా.. హైదరాబాద్ లో ఉంటున్నామా అనేలా ఉందని సీరియస్ అయ్యారు భూమా మౌనిక.

Latest Updates