సాగు చట్టాల కమిటీ నుంచి తప్పుకున్న సభ్యుడు భూపిందర్ సింగ్‌

ఢిల్లీలో రైతుల చేస్తున్న పోరాటానికి స్పందించి సుప్రీంకోర్టు నలుగురు సభ్యులతో మంగళవారం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో భారతీయ కిసాన్‌ యూనియన్‌ ప్రెసిడెంట్‌ భుపిందర్‌ సింగ్‌ మాన్ కూడా ఒక సభ్యుడు. అయితే.. ఆ కమిటీ నుండి భూపిందర్‌సింగ్‌ తప్పుకున్నారు. రైతుల ప్రయోజనాల విషయంలో తాను రాజీపడేది లేదన్నారు. తానెప్పుడూ రైతులు, పంజాబ్‌ పక్షానే ఉంటానని చెప్పారు. గతంలో సాగు చట్టాలను సమర్ధిస్తూ కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలిపిన వారిలో భుపిందర్‌ సింగ్‌ కూడా ఉన్నారు. అయితే సాగు చట్టాలపై సుప్రీంకోర్టు విధించిన స్టేను స్వాగతించిన రైతు సంఘాలు …అది నియమించిన కమిటీని మాత్రం తిరస్కరించారు. కమిటీలో అందరూ ప్రభుత్వానికి అనుకూలురే ఉన్నారని, వీరంతా గతంలో సాగు చట్టాలను సమర్ధించిన వారేనని తెలిపారు. ఈ కారణంగానే ఆ కమిటీ ముందుకెళ్లి తమ వాదనలు వినిపించేందుకు నిరాకరించాయి. దీంతో సుప్రీంకోర్టు నియమించిన కమిటీపైన అందరిలోనూ అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో భూపిందర్ సింగ్ మాన్  కమిటీ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.

సాగు చట్టాల కమిటీలో సభ్యుడిగా నామినేట్ చేసినందుకు సుప్రీం కోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు భూపిందర్ సింగ్ మాన్ . రైతుల ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు.

Latest Updates