వెయ్యి దీపాలతో సుష్మాకు భూటాన్‌ రాజు నివాళి

bhutan-king-lights-thousand-butter-lamps-in-memory-of-sushma-swaraj

సుష్మాస్వరాజ్‌కు భూటాన్‌ రాజు జిగ్మే ఖేసర్‌ నంగ్యేల్‌ వాంగ్‌ చుక్‌ ఘన నివాళులర్పించారు. ఆమె జ్ఞాపకార్థం నెయ్యితో వెయ్యి దీపాలు వెలిగించి సుష్మాకు అంజలి ఘటించారు. స్థానిక ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

గత మంగళవారం తీవ్ర గుండెపోటుతో కేంద్ర మాజీ మంత్రి సుష్మారాజ్‌ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు.సుష్మా మృతి వార్త తెలియగానే బూటాన్‌ రాజు వాంగ్‌చుక్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటుంబానికి వాంగ్‌ చుక్‌ సంతాపం తెలిపారు. విదేశాంగ మంత్రిగా ఆమె సేవలు అద్భుతమన్నారు. భూటాన్‌కు స్నేహితురాలిగా ఉంటూ రెండు దేశాల మధ్య సత్సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ఎంతో కృషి చేశారన్నారు.

మరోవైపు సుస్మాస్వరాజ్ మృతిపట్ల ఐక్యరాజ్య సమితిలో 51 దేశాల దౌత్యవేత్తలు నివాళులర్పించారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి కార్యాలయంలో సుష్మా ఫొటోకు నివాళులర్పించిన దౌత్యవేత్తలు.. అక్కడున్న పుస్తకంలో సంతాప సందేశం రాశారు.

Latest Updates