భూములిచ్చినోళ్లకు ఎయిమ్స్‌‌లో ఉద్యోగాలివ్వాలె

రంగాపురం గ్రామస్తుల నిరసన

భువనగిరి టౌన్, వెలుగు: ఎయిమ్స్ ఏర్పాటుకు భూములు ఇచ్చిన కుటుంబాలకు, లోకల్‌ వారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని రంగాపురం గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. బీబీనగర్‌లోని కేంద్ర ప్రభుత్వం కేటాయించిన ఎయిమ్స్‌లో మెడికల్ క్లాసెస్‌ను డైరెక్టర్ శర్మన్ సింగ్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భం రంగాపురం గ్రామస్థులు ఎయిమ్స్‌ ఎదుట నిరసన వ్యక్తంచేశారు. అనంతరం వారు మాట్లాడుతూ నిమ్స్ భూనిర్వాసితులకు అరకొర నష్టపరిహారం చెల్లించారన్నారు.

రంగాపురంలో భూములు కోల్పోయిన ప్రతి కుటుంబానికి ఎయిమ్స్‌లో ఉద్యోగ అవకాశం కల్పించాలన్నారు శర్మన్ సింగ్. సాగు చేసుకోవడానికి భూమి లేకపోవడంతో గ్రామస్తులు, చదువుకున్న యువత కంపెనీలలో కార్మికులుగా, సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. చదువుకున్న వారికి ప్రాధాన్యమివ్వడంతోపాటు మిగతా వారికి కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ పద్ధతుల్లో ఉద్యోగావకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

మరిన్ని వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Latest Updates