బిగ్‌‌ ‘సి’లో బిగ్‌‌ ఆఫర్లు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఫెస్టివ్‌‌‌‌ సీజన్‌‌‌‌ సందర్భంగా మొబైల్‌‌‌‌ రిటైల్ చెయిన్‌‌‌‌ బిగ్‌‌‌‌ ‘సి’ భారీ ఆఫర్లను ప్రకటించింది. ఈ సీజన్‌‌‌‌లో తమ స్టోర్లలో షాపింగ్‌‌‌‌ చేసిన వారితో లక్కీడ్రా తీసి వంద మంది విజేతలకు రూ.లక్ష చొప్పున నజరానా ఇస్తామని కంపెనీ సీఎండీ బాలు చౌదరి వెల్లడించారు. ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ షాపింగ్‌‌‌‌ సైట్ల కంటే తక్కువ ధరలకు మొబైల్స్‌‌‌‌ను అమ్ముతున్నామని చెప్పారు. ప్రతి మొబైల్‌‌‌‌ కొనుగోలుపై ఐదు వేల వరకు క్యాష్‌‌‌‌ పాయింట్లు కూడా ఇస్తామని ప్రకటించారు. కొన్ని మొబైల్స్‌‌‌‌ పై పదిశాతం క్యాష్‌‌‌‌బ్యాక్‌‌‌‌, కచ్చితంగా గిఫ్ట్‌‌‌‌ ఉంటుంది. తమ వెబ్‌‌‌‌సైట్‌‌‌‌ ద్వారా మొబైల్‌‌‌‌ బుక్‌‌‌‌ చేస్తే 90 నిమిషాల్లోపు డోర్‌‌‌‌ డెలివరీ ఇస్తామని అన్నారు. అంతేగాక బిగ్‌‌‌‌ ‘సి’లో వన్‌‌‌‌ప్లస్‌‌‌‌ 8టీ సేల్స్‌‌‌‌ మొదలయ్యాయి. శామ్‌‌‌‌సంగ్‌‌‌‌ ఏ, ఎం సిరీస్‌‌‌‌ మొబైల్స్‌‌‌‌ను ఎస్‌‌‌‌బీఐ కార్డులతో కొంటే 10 శాతం క్యాష్‌‌‌‌బ్యాంక్‌‌‌‌ ఉంటుంది. వన్‌‌‌‌ప్లస్‌‌‌‌ మొబైల్స్‌‌‌‌పై హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ కార్డుల ద్వారా రూ.మూడు వేల క్యాష్‌‌‌‌ బ్యాక్‌‌‌‌ ఇస్తారు. డౌన్‌‌‌‌పేమెంట్‌‌‌‌గా రూ.101 చెల్లించి వివో ఫోన్లను సొంతం చేసుకోవచ్చు. ఒప్పో మొబైల్స్‌‌‌‌పై 10 శాతం వరకు క్యాష్‌‌‌‌బ్యాక్‌‌‌‌ ఇస్తారు. నో కాస్ట్‌‌‌‌ ఈఎంఐ  సదుపాయమూ ఉంది.

Latest Updates